ఆయుర్వేదం నందు వివరించబడిన ఆరోగ్య సూత్రాలు – 2


* ప్రతిరోజు తలకు నువ్వులనూనె పెట్టుకుంటే తలనొప్పి , వెంట్రుకలు రాలడం , తెల్లబడటం ఏర్పడదు . తల ఎముకలకు మంచి బలం కలుగును. తలవెంట్రుకలు దిట్టమైనవి , పొడవైనవి , నల్లనైనవి ఏర్పడును . ఙ్ఞానేంద్రియాలకు మంచి బలం కలుగును. ముఖం యొక్క చర్మానికి నునుపుదనం వస్తుంది. మంచినిద్ర కలుగును.

* ఉదయాన్నే నువ్వులనూనె నొటియందు ఉంచుకుని పుక్కిలి పట్టడం ద్వారా దౌడ ఎముకలకు , స్వరపేటికకు మంచి బలం కలుగును. ముఖపుష్టి ఏర్పడును . నాలుకకు తీపి మొదలగు రుచులను ఆశ్వాదించే శక్తి పెరుగును . ఆహారంలోని రుచి తెలుస్తుంది. గొంతు ఎండుకుపోవు సమస్య తగ్గును. పెదవులపగుళ్ళు రావు . పళ్ళు అరుగుదల ఉండదు. దంతాల బలం పెరుగును పండ్లనొప్పి , పండ్లకు పులుపు , చాలా చల్లటి ఆహారపదార్థాలు , ద్రవాలు పండ్లకు తగులుటచేత కలుగు బాధ నివారణ అయ్యి కఠినమైన పదార్థాలను సైతం ముక్కలుగా కొరకగల శక్తి దంతములకు లభించును.

* నువ్వులనూనెను పుక్కిటలో కొంచంసేపు ఉంచి బాగ పుక్కిలించవలెను . తెల్లగా నురగ వచ్చునంతవరకు పుక్కిలించవలెను . ఈ ప్రక్రియ దంతధావనానికి ముందు సుమారు 10 నిమిషాలపాటు చేయవలెను . ఆతరువాత చన్నీటితో గాని వేడినీటితో గాని నోరును శుభ్రపరచుకోవలెను . ఈ విధముగా చేయుటవలన పైనచెప్పిన సమస్యలు అన్నియు తీరును .

* ప్రతినిత్యం నువ్వులనూనెతో తలంటుకోవడం వలన త్వరగా ముసలితనం రాదు . అలిసిపోవడం , ఒళ్లునొప్పులు ఉండవు. కండ్లకు తేటదనం వచ్చును. బలం కలుగును. ఆయుష్షు వృద్ధిచెందును. మంచినిద్ర పట్టును . ప్రతినిత్యం తలంటుకొవడం కుదరకున్న కనీసం వారానికి ఒకసారైనా తలంటుకోవలెను.

* ప్రతినిత్యం చెవిలో నువ్వులనూనె రెండుచుక్కలు వేసుకొవడం వలన చెవినొప్పి లాంటి వాత సంబంధమైన చెవిరోగాలు , మెడవెనక భాగం నందు ఉండు నరాలు పట్టుకుపోవడం , చెవుడు సమస్యలు ఏర్పడవు. చెవిలో నూనె వేసుకొని రెండుమూడు నిమిషాలు ఉంచి పక్కకు వంగి ఆ నూనె బయటకి విడువవలెను . అలానే చెవిలో ఉంచుకోకూడదు. నువ్వులనూనె కొంచం గోరువెచ్చగా చేసి వెసుకొనవలెను.

* అరికాళ్లకు నువ్వులనూనె పూసుకోవడం వలన కాళ్లు గట్టిగా ఉండటం , పట్టుకొనిపోవుట , గరగరలాడుచుండుట , తిమ్మిరి , పట్టినట్లు ఉండటం వంటి సమస్యలు తొలగిపోయి కాళ్లకు మెత్తదనం , బలం , ధారుడ్యం ఏర్పడును . కాళ్లనొప్పి , పోటు , గృదసీవాతం రాదు . పగుళ్లు ఏర్పడవు . నాడులు , నరాలు ముడుచుకుపోవడం వంటి సమస్యలు దరిచేరవు .

* శరీరానికి వ్యాయామం అత్యంత ముఖ్యం అయినది. వ్యాయమం వలన శరీరపుష్టి కలుగును. కాంతి ఏర్పడును . శరీరములోని అవయవాలు వేరువేరు ఆకృతుల్లో కాకుండగా సమానంగా ఉండును. ఆకలి పెరుగును . సోమరితనం పోతుంది. శరీరం గట్టిపడును. తేలికగా ఉండును. శరీరం శుభ్రమగును. శరీరానికి అలసట,బడలిక , దప్పిక,సెగ , చల్లదనం వీనిని సహించే శక్తి పెరుగును . మంచి ఆరోగ్యం ఏర్పడును . ఊబకాయం తగ్గును. శరీరం నందు మాంసం గట్టిపడును.

* ఉదయాన్నే అవకాశం లేనివారు సాయంత్రం వ్యాయామాన్ని చేయవచ్చు . వ్యాయామాన్ని తనకుగల శక్తిలో సగానికి తగినట్లు చేయవలెను . అలాకాకుండా సగం శక్తికి మించి మరియు తన శక్తి కంటే మించి వ్యాయమం చేయువానికి శరీరం నందు వాతం ప్రకోపించి శరీర బాధలు ఏర్పడును . వ్యాయామం అతిగా చేయుటవలన క్షయవ్యాధి , దప్పిక, అరుచి , వాంతి , రక్తపిత్తం అనగా ముక్కు,కండ్లు , చెవులు , నోరు , మలద్వారములు , రోమకూపములు నుండి రక్తం కారుట , మైకము , బడలిక , దగ్గు , నిస్సత్తువ , జ్వరం , ఉబ్బసం వంటి రోగాలు సంభంవించును.

* వ్యాయమం కొంత శరీర బలం కలవారికి , నెయ్యి , పాలు వంటి జిడ్డు పదార్దాలు కలిసిన ఆహారాన్ని భుజించు వారికి మాత్రమే హితమైనది . పుష్టిగా లేనివారు వ్యాయమం చేయకూడదు . శరీరంలోని రంధ్రాల నుంచి రక్తం కారువారు , ఉబ్బసం , దగ్గు , క్షయ వ్యాధులు కలవారు , మిక్కిలి చిక్కిన శరీరం కలవారు , నీరసం కలవారు , అప్పుడే భోజనం చేసినవారు , స్త్రీసాంగత్యం వలన అలసినవారు , మైకం కలవారు వ్యాయమం చేయరాదు .

* పురుషులు వ్యాయామం చేయవచ్చు కాని స్త్రీలు అతివ్యాయామం చేయరాదు . రుతుక్రమం దెబ్బతినును. ఎముకలు సడలిపోవును. వక్షోజాలు మరీ గట్టిపడి కుచించుకుపోవును . గర్భసంచి జారిపోయే ప్రమాదం కలదు. అవాంఛితరోమాలు పెరుగును . వ్యాయామం బదులు కొంత దూరం నడవటం మంచిది . శరీరానికి అతిగా శ్రమ తగలకుండా నడవలెను . ఇలా చేయడం వలన ఆయష్షు , బలం , బుద్ది , ఆకలి పెరుగును . ఇంద్రియాలకు మరింత చురుకుదనం కలుగును.

తరవాతి పోస్టులో మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు మీకు తెలియచేస్తాను. ఆహార సంబంధ ఆరోగ్యకరమైన విషయాలు , ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో నా గ్రంధాల యందు విపులముగా ఇచ్చాను. తెప్పించుకొని చదవగలరు.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author