టీవీ9 మాజీ సీఈవో అరెస్టుకు రంగం సిద్ధమౌతోందా…?
* Cr.P.C సెక్షన్ 41-A క్రింద నోటీసులు జారీచేసిన సైబర్ క్రైం
ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్…
* 15-05-2019 ఉదయం 11గం సైబరాబాద్ కమీషనరేట్,
గచ్చిబౌలి లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో… తన ముందు
విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు
సైబర్ క్రైం ఇన్స్పెక్టర్.
* విచారణ నోటీసులో ఓ పది నిబంధనల్ని పేర్కొన్న ఇన్స్పెక్టర్
టీవీ9 మాతృ సంస్థ ఏబిసిఎల్ ను టేకోవర్ చేసిన అలంద మీడియా & ఎంటర్టైన్మెంట్ , డైరెక్టర్ పుల్లూరి కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా సంస్థ మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాష్ పై ఫోర్జరి, మోసం తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గతంలో విచారణకు హాజరు కావాలని Cr.P.C సెక్షన్ 160 క్రింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే… అయితే తనకు కనీసం పదిహేను రోజుల సమయం కావాలని తన లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు రవిప్రకాష్.
మరోవైపు సంస్థ సీఎఫ్ఓ మూర్తిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు దాదాపు ఒక అంచనాకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతను అప్రూవర్ గా మారడానికి సిద్ధపడ్డట్టు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వీటిని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది
గత కొన్ని రోజులుగా రవిప్రకాష్ ఎవరికి అందుబాటులో లేకపోవడం, సీఎఫ్ఓ ముర్తి ద్వారా కీలక సమాచారాన్ని సేకరించిన పోలీసులు, తమ దూకుడు పెంచారు… తాజాగా Cr.P.C సెక్షన్ 41-A క్రింద ఓ పది నిబంధనలతో కూడిన తాఖీదు జారీచేసారు సైబర్ క్రైం పోలీసులు. వ్యక్తిగతంగా రవిప్రకాష్ అందుబాటులో లేని కారణంగా అతని నివాసంలోని కుటుంబ సభ్యులకు నోటీసును అందించారు పోలీసులు.
అత్యంత కీలక, విశ్వసనీయ వ్యక్తుల సమాచారం మేరకు రవిప్రకాష్ ప్రస్తుతం విజయవాడలో అజ్ఙాతంలో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. వీటి విశ్వసనీయతపై మాత్రం నో కామెంట్స్…