జగన్‌ మౌనంగానే వ్యూహాలను రచిస్తున్నారా …!


ఫలితాలు దగ్గరపడడంతో పార్టీల నేతలంతా మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాల నేపథ్యంలో కేసీఆర్‌, చంద్రబాబు ఇద్దరూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో తలమునకలయి ఉండగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఫలితాల పై సమీక్షలు చేమడం కానీ,రాజకీయాలపై మాట్లాడడంగానీ,జాతీయ నాయకులను కలిసే ప్రయత్నంగానీ ఇప్పటి వరకు తెలియలేదు.ఆయన మనసులో ఏం ఉందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిశాక పులివెందుల నుంచి హైదరాబాద్‌ వచ్చిన జగన్‌ , పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందనీ, లోటస్‌ పాండ్‌ లో మీడియాతో మాట్లాడిన అనంతరం సైలెంట్‌ అయిపోయారు. అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్‌ తో కానీ టచ్‌ లో ఉన్నట్లుగా ఎలాంటి సంకేతాలివ్వలేదు. ఎంపీ సీట్లలో కనీసం 20 సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇపుడున్న రాజకీయ పరిస్దితుల్లో 20 ఎంపీ సీట్లు చేతిలో ఉంటే కొత్త ప్రభుత్వంలో చక్రం తిప్పవచ్చు, అయినా జగన్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నదానిపై రాజకీయ,మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్‌ ఫలితాల మీ దృస్టి పెట్టకుండా రాబోయే ఐదేళ్ల పాలన పై కసరత్తు చేసుకుంటూ పోతున్నారు. విద్యావంతులు సీనియర్‌ అధికారులు,మేధావులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో చర్చల్లో తలమునకలయి ఉన్నారు. వారి విలువైన సలహాలను తీసుకుంటున్నారు. విద్య,వైద్యం,వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడం మీదనే ఎక్కువగా మేధోమథనం జరుపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే, నిరంతరం జనం సమస్యలు పరిష్కరిస్తూ, పరిపాలనలో రోల్‌ మోదల్‌గా ఉండాలని, జగన్‌ మౌనంగానే వ్యూహాలను రచిస్తున్నారని తెలిసింది.

About The Author