వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేస్తున్నారా.. అయితే మీకిది షాకింగ్ వార్తే!
వాట్సాప్ యాజమాన్యం తమ 1.5 బిలియన్ల యూజర్లకు ముఖ్య విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ యాప్ యూజర్లంతా యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. వాట్సాప్‌లో ఉన్న వాయిస్ కాల్ ఫీచర్ ద్వారా ఫోన్లలో వైరస్ అటాక్ అవుతున్నట్లు ఆ సంస్థ గుర్తించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేసిన స్పైవేర్ వాట్సాప్ వాయిస్ కాల్స్ అదనపు భద్రతకు సంబంధించి ఫీచర్లను జత చేస్తుండగా ఫోన్లలో ప్రవేశించిందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది.
వాట్సాప్‌లో కాల్ లిఫ్ట్ చేసినా, చేయకపోయినా కేవలం మిస్డ్ కాల్ ఇచ్చినా ఈ వైరస్ అటాక్ అవుతున్నట్లు తెలిసింది. ఈ వైరస్ ఫోన్లలో అటాక్ అయితే వ్యక్తిగత సమాచారంతో పాటు రహస్య సమాచారాన్నంతటినీ తస్కరించగలదని తెలియడంతో వాట్సాప్ తమ యూజర్లను అలర్ట్ చేసింది. అందరూ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మే మొదటి వారంలో ఈ స్పైవేర్‌ను అటాక్ అయినట్లు గుర్తించామని, తమ టీం ఆ సమస్యను పరిష్కరించిందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.