రాహుల్ మీరు చెప్పింది అబద్ధం… అటువంటి పదం మా డిక్షనరీ లో లేదు… ఆక్స్‌ఫర్డ్
ప్రధాని మోదీని విమర్శించే అత్యుత్సాహంలో… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘మోదీలై’ అనే ఓ కొత్త పదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే… ‘మోదీలై’ అంటే పదే పదే సత్యాలను వక్రీకరించే వ్యక్తి… అంటూ ఆ పదానికి అర్దాన్ని కూడా వివరించాడు రాహుల్… అంతేకాక నిఘంటువులో టైప్ చేస్తే, ఈ పదానికి మూడు రకాల అర్థాలు వస్తాయని ఓ స్నాప్ షాట్ ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే అసలు వివాదం ఇక్కడే మొదలైంది, రాహుల్ పెట్టిన స్నాప్ షాట్ లో ప్రఖ్యాత నిఘంటువు సంస్థ ఆక్స్‌ఫర్డ్ లోగో ఉండేసరికి… దీనిపై నెటిజన్లు కూడా తికమక పడ్డారు. ఇటువంటి పదాన్ని తాము టైప్ చేసి చూసినప్పటికీ ఈ అర్థాలు తమకు కనపడడం లేవంటూ వరుస ట్విట్లతో హోరెత్తించారు..
రాహుల్ ట్వీట్ చేసిన మరుసటి రోజే అనూహ్యంగా ట్విట్టర్ తన అధికారిక ఖాతా ద్వారా స్పందించింది… అసలు అటువంటి పదం తమ నిఘంటువులో లేదని, రాహుల్ జతచేసిన స్నాప్ షాట్ ఫేక్ అంటూ… రాహుల్ కు దిమ్మతిరిగే షాక్ ను ఇచ్చింది ఆక్స్‌ఫర్డ్.