ఆయుర్వేదం నందు వివరించబడిన ఆరోగ్య సూత్రాలు – 4

* శరీరానికి చందనం పూసుకోవడం వలన సౌభాగ్యం , చర్మానికి కాంతి , సంతోషం , ఓజస్సు , బలం పెరుగుతాయి . చెమట, దుర్వాసన , మచ్చలు పోతాయి . నిస్సత్తువ తగ్గును.

* రత్నాభరణాలను ధరించడం లక్ష్మీకరం . మంగళకరం . దుఃఖాన్ని పోగొట్టును . సంతోషాన్ని ఇచ్చును. కోర్కెలను తీర్చును. ఓజస్సు పెరుగును .

* తలవెంట్రుకలు , గడ్డం , మీసం , గోళ్లు వీనిని కత్తిరించడం వలన బలం , మగతనం, ఆయుర్దాయం , అందం పెరుగును .

* ఐదురోజులు ఒకసారి తలవెంట్రుకలు , గడ్డం , మీసం , ఒంటిమీద వెంట్రుకలు , గోళ్లు కత్తిరించుకోవాలి. వీటిని తనచేత్తో తీసుకోరాదు . గోళ్లను పండ్లతో కొరికి తీయరాదు. క్షవరం చేసుకున్న తరువాత స్నానం చేయరాదు . ముక్కులో వెంట్రుకలు పీకరాదు అలా పీకినచో కంటిచూపు దెబ్బతినును . ముక్కులో వెంట్రుకలు కత్తిరించుకోవాలి తప్ప పీకరాదు.

* మనిషి ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు మాత్రమే భోజనం చేయవలెను . మధ్యలో భోజనం చేయరాదు .

* ఉదయం పూట భోజనం తొమ్మిది గంటలలోపు చేయరాదు . పన్నెండు గంటల తరువాత చేయరాదు . రాత్రి భోజనాన్ని తొమ్మిది గంటలలోపు చేయాలి . ఎప్పుడు పడితే అప్పుడు తినడం వలన జీర్ణావయవాలకు విశ్రాంతి దొరకడం వలన అవి బలహీనపడును. దానివలన జీర్ణసంబంధ వ్యాధులు కలుగును.

* భోజనం సరైన కాలంలో మాత్రమే చేయవలెను . తనకు సరైనది , శుభ్రమైనది , ఆరోగ్యకరమైనది , నెయ్యిలాంటి కొవ్వు పదార్దాలు కలిసినది , కొంచం పలుచుగా ఉండేది అగు ఆహారాన్ని తినవలెను . మరీ చల్లారిపోయింది , తేలికగా జీర్ణం కాని ఆహారాన్ని తినరాదు. తీపి కొంచం ఎక్కువుగా ఉండి ఆరు రసాలు కలిగిన ఆహారాన్ని తినవలెను .

* త్వరత్వరగా , హడావిడిగా భోజనం చేయరాదు . అదేవిధముగా మిక్కిలి మెల్లగా భోజనం చేయరాదు . స్నానం చేసిన తరువాత ఆకలిగా అనిపిస్తేనే భోజనం చేయవలెను . కాళ్లు , చేతులు కడుక్కుని ఏకాంతముగా భోజనం చేయవలెను . ఆహారపదార్థాలను దేన్నీ కూడా దూషించరాదు. భోజన సమయము నందు మౌనంగా ఉండవలెను . ఇష్టమైన పదార్ధాన్ని ఇష్టమైన వారు వడ్డిస్తుండగా తినవలెను .

* కడుపు యొక్క నాలుగింట రెండు భాగాలను అన్నం మొదలగు గట్టి ఆహారపదార్థాలతో నింపవలెను . మూడొవ భాగాన్ని నీళ్లు మొదలగు ద్రవపదార్దముతో నింపవలెను . నాలుగొవ భాగాన్ని వాయుప్రసారానికి అనువుగా వదిలివేయవలెను.

* భోజనం చేయునపుడు తడికాళ్ళు కలిగినవాడుగా భోజనం చేయవలెను . నిద్రించునప్పుడు పొడికాళ్ళు కలిగినవాడుగా నిద్రించవలెను. తడికాళ్లతో భుజించువాడు దీర్ఘజీవితం పొందువాడు అగును.

* భోజనం చేయునపుడు మంగళకరమైన , మనసుకి ఆనందాన్ని ఇచ్చే వస్తువులను చూడవలెను . దీనివల్ల ఆయుర్దాయం కలుగును.

* భోజనం చేయునపుడు అల్లం , ఉప్పు కలిపి తినటం వలన ఆకలి కలుగును. నోటికి రుచి ఏర్పడును . నాలిక , గొంతు శుభ్రపడును . భోజనం చేసేప్పుడు ముందు గట్టిగా ఉండు ఆహారపదార్థాలను నెయ్యి కలిపి తినవలెను . అటుతరువాత ద్రవమైన ఆహారాన్ని తీసికొనవలెను . ఇలా చేయడం వలన రోగాలు రావు .

తరవాతి పోస్టులో మరిన్ని ఆహార నియమాలు వివరిస్తాను.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author