హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!

టాలీవుడ్ లో రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. కెరీర్ మొదట్లో విలన్ గా నటించిన ఆయన తర్వాత హీరోగా మారారు. హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటించారు. విలన్, కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన మార్క్ చాటుకున్న శ్రీహరి 2013లో పలు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరి హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి తన సహనటి డ్యాన్సర్ డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత డిస్కో శాంతి సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. శ్రీహరి-డిస్కోశాంతి దంపతులకు ఇద్దరు కుమారులు మేఘంష్ శ్రీహరి – శశాంక్ శ్రీహరి. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో అనుకోకుండా శ్రీహరి చనిపోవడం ఓ వైపు చిత్ర పరిశ్రమకి మరోవైపు కుటుంబానికి తీరని నష్టం వాటిల్లింది. శ్రీహరి నటుడిగానే కాకుండా సామాజిక సేవా దృక్ఫదం కలిగిన వ్యక్తి అని..ఇబ్బందుల్ల ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు ఎంతో మందికి ఆర్థిక సహాయం చేశారని అంటారు.

శ్రీహరి మరణించే సమయానికి ఇద్దరు కుమారులు చిన్నవాళ్లు..అప్పట్లో శ్రీహరి నటించిన ఓ సినిమాలో తన తనయుడు కూడా నటించాడు. తాజాగా మేఘంష్ కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు

About The Author