నిజామాబాద్ రైతులకు రాజీనామా చేస్తానని బాండు రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్…
సార్వత్రిక ఎన్నికలలో యావత్ దేశాన్ని ఆకర్షించిన అంశం… రైతన్నల మూఉమ్మడి నామినేషన్లు….
దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న పసుపు బోర్డు, ఎర్రజొన్నకు మద్దతు ధరల విషయంలో… పాలకుల నిర్లక్ష్యానికి విసుగు చెందిన రైతన్నలు 178మంది నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే…
సిట్టింగ్ ఎంపీగా ఉన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల కవిత తన సమీప ప్రత్యర్ధి, భా.జ.పా అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో 70,875 ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూసారు… ఈ ఓటమి ఒక్క కవితకే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు శరాఘాతమే అని చెప్పవచ్చు…
ఎంపీ గా అద్భుత విజయాన్ని సొంతం చేసుకొన్న ధర్మపురి అరవింద్, తన విజయ యాత్రకు ప్రధాన కారణమైన నిజామాబాద్ రైతన్నను ఉద్దేశించి.. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును కాని, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధరలను సాధించలేకపోతే… తన పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమాలలో పాల్గొంటానని గత మార్చిలో వంద రూపాయల బాండు పేపరుపై ధర్మపురి అరవింద్ వ్రాసిన ప్రమాణ పత్రం… ప్రసతుతం నెట్టింట జోరుగా తిరుగుతోంది.
బాండు పేపరుపై రాతలకే కాక, వాస్తవంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వారి తల రాతలను మార్చడంలో ఎంపీగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడని ఆశిద్దాం..!