ఇంక ఎం పీ లకు వి ఐ పి కల్చర్ లేదు –


ఢిల్లీకి వచ్చిన కొత్త ఎం పీలు ఇంక పూర్తిగా వారికి ప్రత్యేక ప్రభుత్వ భవనాలు అందేవరకు ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసిన గదుల్లోనే తాత్కాలికంగా నివాసం ఉంటారు. స్టార్ హోటళ్లలో నివాసము ఏర్పాటు చేయడం అనేది ఉండదు – దీని ద్వారా దాదాపు ముప్పై కోట్ల పైగా ప్రజాధనం ఆదా. సుదీర్ఘ రాజకీయాల నుండి రిటైర్డ్ అయిన శ్రీమతి సుమిత్రా మహాజన్ గారి ప్రతిపాదన ఇది దీనిని ఆనాడు ఆమె పార్లమెంటులోని అన్ని పక్షాలతోను చర్చించి ఆమోదింప జేశారు . అలాగే పార్లమెంటుకు వస్తున్న ఎం పీల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ . దాని వల్ల ప్రజలకు ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కూడా పార్లమెంటుకు కొత్తదారి ఏర్పాటు చేయడానికి ఆమె అనేక సూచనలు ఏర్పాట్లు ఆరంభించడానికి కృషి చేసారు . డెబ్బయి ఐదేళ్లు నిండి డెబ్బయి ఆరేండ్లు రావడం వల్ల శ్రీమతి సుమిత్రా మహాజన్ ఇంక రాజకీయాలకు స్వస్తి చెప్పి కేవలం ఇంక పార్టీ గౌరవ సలహాదారుగా మాత్రమే ఉండాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఎనిమిది సార్లు ఇండోర్ నుండి ఎం పీ గా ఎన్నిక అయిన ఆమె 16 వ లోక్ సభలో స్పీకర్ గా అత్యున్నతంగా చేసి అన్ని పార్టీలు మెచ్చే విధంగా పార్లమెంటును నడిపారు. మచ్చలేని నాయకురాలిగా , ప్రధాన సేవకుడు నరేంద్ర మోడీని సైతం అదలించి అదుపులో పెట్టగలిగే వ్యక్తిగా ఆమెకు పేరు. ప్రధాని కూడా ఇండోర్ సభలో ఇదే మాట అన్నారు .. తాయి ఒక్కటే నన్ను, నా ఆవేశాన్ని తొలినాళ్ళనుండీ అదుపులో పెట్టగలిగింది అని. అచ్చ భారతీయ కట్టు బొట్టు ఆహార్యం మృదువుగా నిక్కచ్చిగా ఎంతటివారితో అయినా మొహమాటం అనేది లేకుండా నిజాయితీగా ఓ కుటుంబ పెద్దగా మాతృమూర్తిగా వ్యవహరిస్తారు. ఇలాంటి రాజకీయ నాయకులు బహు అరుదు

About The Author