స్మృతీ ఇరానీ అనుచరుని దారుణ హత్య…
అమేథీలో బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు.
అతని ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ మొదటి నుంచి బీజేపీకి మద్దతుదారుడు.
స్మృతి ఇరానీకి సన్నిహితునిగా పేరొందాడు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ గెలుపునకు ఎంతగానో కృషి చేశారు.
శనివారం రాత్రి సురేంద్రసింగ్ను దుండగులు హత్య చేశారు. అతనిపై దాడి జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది.
కాగా దీనిని రాజకీయ హత్యగా బరోలియా గ్రామస్తులు భావిస్తున్నారు. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటచేసుకున్న దరిమిలా బరోలియా గ్రామంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద భద్రతను మరింత పెంచారు.