ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్…
ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్… డీవోపీటి ఉత్తర్వులు లాంఛనమే…
సోమవారం, జగన్ ను తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన స్టీఫెన్… వెనువెంటనే కార్యరంగంలోకి దిగినట్టు సమాచారం… అయితే డిప్యుటేషన్ కు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడేందుకు ఓ రెండు వారాల సమయం పట్టనుండటంతో… ప్రస్తుతం సెలవులో ఉన్న స్టీఫెన్ రవీంద్ర… అనధికార అధికారి గా విధులు నిర్వర్తించనున్నారని సమాచారం…
1999 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి… ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఐటీ గ్రిడ్ డేటా చోరీ పై వేసిన సిట్ కు ఛీఫ్… ఫ్యాక్షనిజం, నక్సలిజాల పాలిటి సింహస్వప్నంగా పేరుతెచ్చుకొన్న… 46సంవత్సరాల డైనమిక్ అధికారి స్టీఫెన్ రవీంద్ర.
గతంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నక్సల్స్ తో శాంతి చర్చ లు జరిపే సమయంలో… వరంగల్ ఎస్పీగా , జిల్లా పరిధిలో నక్సల్స్ ఎన్‌కౌంటర్ జరిపి పెను సంచలనానికి కారణమయ్యారు…
ఆ తర్వాత రాజశేఖరరెడ్డి ముఖ్య భద్రతా అధికారిగా పనిచేసి, వైఎస్ కుటుంబానికి ఆప్తుడైయ్యారు…
దేశంలోనే సుధీర్ఘ సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్… ఇటీవలి కాలంలో తీరప్రాంత భద్రత పై వెలువడుతున్న హెచ్చరికలు… రాష్ట్రంలో పెరుగుతున్న నక్సల్ కార్యకలాపాలు, అక్కడక్కడా మళ్ళీ పడగలు విప్పుతున్న ఫ్యాక్షనిజం… ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా అంశాలపై పోలీసింగ్ లో స్టీఫెన్ కు ఉన్న పూర్వ అనుభవన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని, జగన్ భావించారు… అందుకు అనుగుణంగానే… ఇటీవల కేసీఅర్ తో జరిగిన భేటీ లో జగన్ చేసిన విజ్ఙప్తి కి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి స్టీఫెన్ బదిలీకి అంగీకరించారు…
అంతేకాక, దాదాపుగా ఖరారైన నూతన డీజీపీ గౌతం సవాంగ్ తో స్టీఫెన్ కు మంచి అనుబంధమే ఉంది… స్టీఫెన్ వరంగల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో… గౌతం సవాంగ్ వరంగల్ రేంజ్ ఐజీగా పనిచేశారు.
పక్కా హైదరాబాదీ అయిన స్టీఫెన్, స్కూల్ స్థాయి నుంచి, పీజి వరకు హైదరాబాద్ లోనే చదివారు…. పీజీ లో జంతుశాస్త్రానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం లో గోల్డ్ మెడల్ సాధించారు… అటు తర్వాత సివిల్స్ పై మక్కువతో ఐపీఎస్ కు అర్హత సాధించారు స్టీఫెన్ రవీంద్ర.