మోదీ వాడుతున్న నలుపు రంగు రేంజ్ రోవర్ వాహనం ప్రత్యేకతలు..


మోదీ వాడుతున్న నలుపు రంగు రేంజ్ రోవర్ వాహనం ప్రత్యేకతలు..

పెట్రోల్ వేరియంట్.. 3 లీటర్ వీ6 టర్బో చార్జ్ డ్ ఇంజిన్ ఉండడంతో 340 హార్స్ పవర్ తో 6500 ఆర్పీఎమ్ శక్తిని ఇస్తుంది.

ఇందులో 8 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంది. ఇక ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.8 సెకన్లలోనే అందుకుంటుంది.

అత్యధికంగా గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఇక ఆల్ టెర్రయిన్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంది. టైర్లలో గాలి పరిమాణాన్ని సూచించే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఈ కారులో ఉండడం విశేషం.

ఇక సేఫ్టీ మెజర్స్ కూడా ఈ కారులో చాలా ఉన్నాయి.. వాహనం అదుపుతప్పకుండా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది.

అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎమర్జన్సీ బ్రేక్ అసిస్టెన్స్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్ ఉండడం విశేషం.

ఈ కారును పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో రూపొందించారు.

About The Author