పట్టణ రహదారులు సుందరంగా ఉండాలి…హరీష్ రావు


– రహదారుల అభివృద్ధి లో మిగతా నగరాలతో పోటీ పడి అందంగా తీర్చిదిద్దాలి.
– నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రహదారుల పనులు వేగంగా పూర్తి చేయాలి.
– సిద్ధిపేట నియోజకవర్గంలో రహదారుల పనుల పురగతి పై ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమీక్ష..

పట్టణ రహదారులని సుందరంగా ఉండాలని..ఖమ్మం సంగారెడ్డి , తూప్రాన్ వంటి పట్టణాలు చూస్తే రోడ్లు అందంగా ఉంటయాని అలాంటి నగరాలు, పట్టణాల తో పోటి పడి అందంగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.. పట్టణంలో 20కోట్ల తో పాత బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు నిర్మిస్తున్న రోడ్డు వైడింగ్ జాప్యం పై అరా తీశారు.. ఫుట్ పాత్ , డివైడర్ పనులు ముమ్మరంగా చేయాలని చెప్పారు.. అదే విధంగా ₹5కోట్ల తో పొన్నాల నుండి పాత బస్టాండ్ వరకు కొత్తగా వేసే బిటి రోడ్డు రిన్యువల్ పనులు వెంటనే ప్రాంభించాలని ఆదేశించారు..₹16 కోట్ల తో ముస్తాబాద్ చౌరస్తా నుండి గాడి చేర్ల పల్లి వరకు డబుల్ రోడ్డు పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తానని వెంటనే పనులు చేపట్టాలన్నారు..వేములవాడ కామన్ నుండి రామంచ వరకు నిర్మిస్తున్న రహదారి పనులు కొంత వరకు పూర్తి కాగా మిగులు 30కోట్ల రోడ్డు పని ఇమామ్ బాద్ నుండి రామంచ వరకు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు రహదారుల పనులు వేగంగా చేపట్టాలని చెప్పారు.. పలు రోడ్ల పనులపై వివరాలు అడిగి తెల్సుకున్నారు.. రహదారుల నిర్మాణాల భూసేకరణ, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుక రావాలని చెప్పారు.. పనుల్లో త్వరితగతిన పూర్తి అయ్యేలా ఏజెన్సీలు అధికారుల సమన్వయం తో పని చేయాలన్నారు..

– మెదక్ , హైదరాబాద్ రహదారి పై అసంతృప్తి…

– ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్ సమన్వయం తో పని చేయాలి..

సిద్ధిపేట పట్టణంలో హైదరాబాద్ రోడ్డు , మెదక్ రోడ్డు పనులపై మాజీ మంత్రి , ఎమ్మెల్యే ఆగ్రహం , అసంతృప్తి వ్యక్తం చేశారు..రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరాల తర్వాత సిద్దిపేట లోనే ఫుట్ పాత్ తో రహదారులు ఏర్పాటు చేశామని కానీ దాని క్వాలిటీ విషయం లో నచ్చలేదు అని మండిపడ్డారు.. మెదక్ రోడ్డు లో వెంటనే రహదారి, ఫుట్ పాత్ మరమ్మతులు చెపట్టి రోడ్లను అందంగా తీర్చిదిద్దాలన్నారు.. ఫుట్ పాత్ నాణ్యత లోపించి నాటిన మంచి మొక్కలు పడయ్యాయాని , పట్టణ సుందరికరణ దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదే విదంగా మెదక్ రోడ్డు పనుల జాప్యం పై అధికారులపై , ఏజెన్సీ లపై సీరియస్ అయ్యారు.. ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారూ..మెదక్ రోడ్డు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్ పనులు పై పబ్లిక్ హెల్త్ అధికారులపై మండిపడ్డారు.. ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని.. మెదక్ , హైదరాబాద్ రోడ్డు పనుల పై అసంతృప్తి గా ఉన్నట్టు చెప్పారు.. అదేవిధంగా కరీంనగర్ రోడ్డు లో పెండింగ్ ఉన్న పనులు వెంటనే చేపట్టాలి చెప్పారు.. పట్టణ ఇరువైపులా ఉన్న రహదారులు అందంగా తీర్చిదిద్ధి రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలన్నారు..

– దసరా నాటికి కొత్త కలెక్టరేట్…

దసరా నాటికి కొత్త కలెక్టరేట్ పూర్తి కావాలని , దసరా రోజే శంకుస్థాపన చేసుకున్నాం అని అదే రోజు కొత్త కలెక్టరేట్ సీఎం కేసీఆర్ గారి చేతుల మీదగా ప్రారంభం చేసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులకు చెప్పారు..నూతన కలెక్టరేట్ అద్బుతంగా ఉండాలను.. కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయలు కూడా వేగంగా పనులు చేయాలని కోరారు..ఆర్ అండ్ బి ఈఈ కార్యాలయం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చుకోవాలి చెప్పారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ వెంకటేశ్వర్లు , ఈఈ సుదర్శన్ , డి ఈ రవి , ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

About The Author