శ్రీవారి ఆలయ ప్రవేశం పై రమణధీక్షితులుకు లైన్ క్లియర్.
తిరుమల…. శ్రీవారి ఆలయ ప్రవేశం పై రమణధీక్షితులుకు లైన్ క్లియర్.
జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలసిన రమణధీక్షితులు.
రేపు ఆలయంలో కలుద్దామన్న వైయస్ జగన్.
తనని ఆలయంలోకి అనుమతించడం లేదన్న రమణధీక్షితులు.
తాను చూసుకుంటాను అని భరోసా ఇచ్చిన వైయస్ జగన్.
రేపు ఆలయంలో కలుద్దాం… అన్నీ నేను చూసుకొంటాను… ‘నేనున్నాను’ అంటూ రమణ దీక్షితులకు జగన్ భరోసా…
వేంకటేశుని దర్శనానికై తిరుమల వచ్చి పద్మావతి అతిధిగృహంలో బస చేసిన ఆంధ్రప్రదేశ్ నిశ్చిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు, ఒకప్పటి స్వామివారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు…
ఈ సందర్భంగా రేపు ఆలయంలో కలుద్దాం అని రమణ దీక్షితులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించగా… తన ఆలయ ప్రవేశానికి అధికారులు సమ్మతించడంలేదు అంటూ వాపోయారు రమణ దీక్షితులు.. అయితే, నేనున్నాను, అన్నీ తాను చూసుకొంటానంటూ… రమణ దీక్షితులకు భరోసా ఇచ్చారు జగన్…
రమణ దీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలో… ప్రభుత్వంపై బహిరంగ ఆరోపణలు చేసి దుమారం రేపారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయనే సంచలన ఆరోపణలు చేశారు రమణ దీక్షితులు
తిరుమలలోని పోటు వద్ద జరిగిన త్రవ్వకాలపై వచ్చిన ఆరోపణలు, బిజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు స్వాగతం పలకటం, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో చర్చలు వంటి పరిణామాల నేపథ్యంలో… రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది.
రమణదీక్షితుల పట్ల టీటీడీ, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గతంలో వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక ఆయనకు వైఎస్ జగన్ గతంలోనే తన మద్దతును ప్రకటించారు.
ప్రమాణస్వీకారానికి ముందు స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందటానికి తిరుమల చేరుకొన్న జగన్ ను… రమణ దీక్షితులు కలవడం చర్చనీయాంశమైంది.
జగన్ ఇచ్చిన భరోసా తో..త్వరలోనే తిరుమల ఆలయంలోకి రమణదీక్షితుల పునరాగమనం జరుగనున్నదనే ప్రచారం జరుగుతోంది.