ప్రజాశక్తి కాకినాడ విలేకరిపై హత్యాయత్నం..!

*ప్రజాశక్తి విలేకరి చిరంజీవి కుమార్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (APMF)

*ఆందోళన కలిగిస్తున్న విలేకరుల పై దాడులు..!*

*తాజాగా ప్రజాశక్తి కాకినాడ విలేకరిపై హత్యాయత్నం..!*

సమాజ శ్రేయస్సు కోసం 24 గంటలు కుటుంబాలను, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్న విలేకరులపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత దారుణం అని ఆంధ్రప్రదేశ్ మీడియా పెడరేషన్ (APMF)కృష్ణాజిల్లా కన్వీనర్ షేక్ మస్తాన్ ఆవేదన వ్యక్తపరిచారు.

ప్రజాశక్తి కాకినాడ విలేఖరి గా పనిచేస్తున్న గురాల చిరంజీవి కుమార్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ, దాడి చేసిన వారు ఎంతటి వారైనా వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేస్తుంది.

ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠిన చట్టాలను తీసుకు వచ్చి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (APMF) డిమాండ్ చేస్తుంది..

చిరంజీవి కుమార్ కి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తుంది అని షేక్ మస్తాన్ తెలియజేశారు.

ప్రజాశక్తి కాకినాడ విలేకరిగా పనిచేస్తున్న గురాల చిరంజీవి కుమార్ పై హత్యాయత్నం జరిగింది.బందువులు,పోలీసుల కధనం ప్రకారం కాకినాడ పల్లంరాజు నగర్లో నివాసం ఉంటున్న చిరంజీవిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని ఐదుగురు దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి ఇష్టానుసారంగా దాడికి దిగారు..

బీరు సీసాలతో పొడవబోయారు.వారినుండి తప్పించుకునే ప్రయత్నంలో విలేకరి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.ప్రాణ భయంతో పరుగురులు పెట్టిన బాధితుడుని వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు.వెంటనే స్థానికులు గమనించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు పరారయ్యారు..

వెంటనే చిరంజీవిని కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. ముఖంపై 7 కుట్లు పడ్డాయి.ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు కాకినాడ డిఎస్పీ రవి వర్మ ఆసుపత్రికి వచ్చి బాదితుడి నుండి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించారు..

చిరంజీవి కుమార్ కి వారి కుటుంబానికి తమపూర్తి సపోర్ట్ ఉంటుందని షేక్ మస్తాన్ తెలియజేశారు..

About The Author