బయపడి వెనక్కు తగ్గిన మమతా బెనర్జీ…?
మోది గారి ప్రమాణ స్వీకారానికి తానూ హాజరవుతానని చెప్పిన మమతా బెనర్జీ ఒక్కసారిగా వెనక్కుతగ్గి తాను మోది గారి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేనని తెలియజేసింది. ఇందుకు తనను మరొలా భావించవద్దని కోరింది …… అయితే అసలు విషయం ఏమిటంటే బెంగాల్ లొ గత ఐదు సంవత్సరాలలొ తృణమూల్ కాంగ్రెస్ గూండాల చేతిలో చంపబడ్ద 54 మంది బిజెపి కార్యకర్తలను బిజెపి ప్రత్యేకంగా మోది ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. వారికి పాసులను అందజేసింది.
అయితే ఈ సంధర్బంగా తాను కనుక ప్రమాణ స్వీకారానికి హాజరయితే, తనను చూసి ఆ 54 కుటుంబాలు తనను వదిలిపెట్టరని, అక్కడ పెద్ద గొడవ జరుగుతుందని భావించిన మమతా బెనర్జీ వెనక్కు తగ్గింది. ఇప్పటికే పరాజయంతో కుములిపోతున్న తనకు, ప్రధాని ప్రమాణ స్వీకారం రోజున గోడవ జరిగితే ఆ విషయం ప్రపంచమంతా తెలుస్తుందని, తన బండారం బయటపడుతుందన్న భయంతో మమతా బెనర్జీ, మోది గారి ప్రమాణ స్వీకారోత్సవానికి రాకుండా యూ టర్న్ తీసుకుంది.