మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఆర్‌బీఐ గుడ్ న్యూస్…

మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI లావాదేవీల సమయాల్లో మార్పులు చేసింది.

*రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS వేళల్ని సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.*

మారిన వేళలు జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి.

*ఆర్‌టీజీఎస్ విండో ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఇనీషియల్ కటాఫ్ సమయం సాయంత్రం 4.30 గంటలు. ఈ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పొడిగించింది* ఆర్‌బీఐ.

*ఆర్‌టీజీఎస్ ద్వారా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు*.

*ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రూ.2, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.5 ఫీజు చెల్లించాలి. సాయత్రం 6 గంటల తర్వాత ఆర్‌టీజీఎస్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.10 ఫీజు చెల్లించాలి.*

*☯మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి రెండు సిస్టమ్స్ ఉంటాయి.*

*ఒకటి నెఫ్ట్. అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్-NEFT*.

*రెండోది ఆర్‌టీజీఎస్. అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS.*

ఆర్‌టీజీఎస్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే అవతలి వారి అకౌంట్‌లోకి వెంటనే డబ్బులు వెళ్తాయి.

నెఫ్ట్ అయితే సెటిల్మెంట్ పద్ధతిలో మనీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది.

ఆర్‌టీజీఎస్‌లో కనీసం రూ.2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.

గరిష్టంగా రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

నెఫ్ట్‌లో కనీస లిమిట్ లేదు. గరిష్ట పరిమితి రూ.10 లక్షలు.

2019 ఏప్రిల్‌లో రూ.112 లక్షల కోట్లు ఆర్‌టీజీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారని ఆర్‌బీఐ లెక్కలు చెబుతున్నాయి.

About The Author