పొగాకు వాడకం ఆరోగ్యానికి అనర్థకం , బారీ మూల్యం చెల్లించక తప్పదనేది నిజం – డా. అంబేడ్కర్

 


తిరుపతి, మే 31: పొగాకు వాడకం ఆరోగ్యానికి అనర్థకం , బారీ మూల్యం చెల్లించక తప్పదనేది నిజం అని ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నోరకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రజలు వీటికి బానిస కాకూడదే నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహిస్తున్నామని దామినేడు పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా.అంబేడ్కర్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎస్.వి.ఆర్.ఆర్.ఆసుపత్రి ప్రాంగణం నుండి ఎస్.వి.మెడికల్ కళాశాల వరకు పొగాకు వాడకంకు హానికరమనే నినాదంతో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామినేడు పిహెచ్ సి , డాక్టర్ మాట్లాడుతూ చిత్తూరు డిఎం అండ్ హెచ్ ఓ డా.రామగిడ్డయ్య, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ అరుణ సులోచానాదేవి ఆదేశాలతో ప్రజల్లో అవగాహన నిమిత్తం ర్యాలీ నిర్వహించామని తెలిపారు . నేటి సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి సినిమాహాళ్లలో , టీవీలలో బారీ మూల్యం చెల్లించక తప్పదనేది ప్రచారం కల్పిస్తున్నారని నేటి జీవన విధానంలో ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ప్రధానమని అన్నారు. పొగాకు వినియోగం తో ఆరోగ్యం అనార్థాలను 1988 లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతి యేటా మే31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని అందువల్ల 34 శాతం వినియోగం నుండి 23 శాతం వరకు తగ్గిందని తెలిపారు. దీన్ని ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం పొగాకు వాడకం మరింత తగ్గించెందకు ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో మంగళం పిహెచ్ సి డా.మధుసూదన్, పారా మెడికల్ ఆఫీసర్ రవికుమార్, డిప్యూటీ డిఎం హెచ్ ఓ సిబ్బంది, అంగంవాడి కార్యకర్తలు , ఎ.ఎన్.ఎం.లు పాల్గొన్నారు. — డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి—

About The Author