గాంధీ ఆసుపత్రి లో Internship అవకతవకలు…

నిబంధనలకు కట్టుబడి నిజాయితీగా ఒక సంవత్సరం intenrhsip చేసిన కొంత మంది హౌస్ సర్జన్ ల కు గాంధీ ఆసుపత్రి యాజమాన్యం intenrhsip పొడగించారు.

మొత్తం గాంధీ మెడికల్ కాలేజీ లో 2018-2019 సంవత్సరం కి 357 మంది Internship కి apply చేసుకున్నారు. అందులో ఇప్పటికే 109 మంది Internship certificate తీసుకున్నారు. ఈ 109 మంది లో కొంత మంది ఒక్క రోజు కూడా Internship చేయకుండానే certificate తీసుకున్నారు.

మొత్తం 13 మందికి extension ఇవ్వాలని మొదట అనుకోని మళ్లీ అందులో ఇద్దరి ని తప్పించి 11 మందికి extension ఇచ్చారు. ఈ పక్ష పాత ధోరణి ఏంటో సదరు అధికారులు తెలపాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ ల సంఘం డిమాండ్ చేస్తోంది.

Internship ధృవ పత్రo కోసం కొంత మంది Interns రెండు నెలల క్రితం ధరఖాస్తు చేసుకుంటే నిన్న extension ఇచ్చారు. క్లియరెన్స్ కు ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న రో తెలపాలని TJUDA డిమాండ్ చేస్తోంది.

సదరు Department నుండి కూడా Internship చేసినట్లు HOD క్లియరెన్స్ ఇచ్చారు. ఇది నమ్మని superindent ఆఫీసు అధికారులు Re-verification కు పంపించారు, అప్పుడు concerned Dept HOD’s Intenrhsip చేసినట్లు తెలిపారు. ఇది కూడా నమ్మని Interns Committee members Extension ఇచ్చారు.

Iris scan లో attendence తక్కవ వుందని కారణాలు చెప్తున్నారు. మరి అసలు ఒక్క రోజు కూడా Internship చేయని వారిని certificates ఇచ్చి ఎలా పంపించారో తెలపాలని TJUDA డిమాండ్ చేస్తోంది.

ఒక్క రోజు కూడా Internship చేయని వాళ్ల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని నిజాయితీగా చేసిన వారికి extension ఇవ్వడం ఏంటని అడగడానికి వెళ్లిన Interns ని సెక్యూరిటీ సిబ్బంది తో బయటికి పంపించారు.

Interns కమిటీ ని వేసిన కూడా ప్రయోజనం లేదు. దొంగలను రాజ మార్గం లో పంపించి నిజాయితీ గా చేసిన వారిని హింసిస్తున్నారు.

కోర్సు పూర్తి అయిన తర్వాత 2 నెలల లోపు TSMC(Telangana State Medical Council) లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. రెండు నెలలు తర్వాత రిజిస్ట్రేషన్ కు వెళ్తే fine, affidavit and testimonials submit చేయాల్సి వస్తుంది అని ప్రశ్నించగా – అది మీ యొక్క తల నొప్పి మాకు ఎందుకూ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.

దీనిని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం తీవ్రం ఖండిస్తూన్నo. Interns కు న్యాయం జరిగేలా పోరాడుతం.

Jai JUDA.

Dr P S Vijay

About The Author