ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్న చంద్రబాబు…

టీడీపీ జాతీయ అధినేత, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఏషియన్ గాస్ట్రాలజి హాస్పిటల్‌కు హెల్త్ చెకప్‌ కోసం వెళ్లారు.

శుక్రవారం ఉదయాన్నే.. పరగడుపున గచ్చిబౌలి లోని ఏషియన్ గాస్ట్రాలజి హాస్పిటల్‌కి చేరుకొని, పూర్తి వైద్య పరీక్షలను చేయించుకొన్నారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రిలో గడిపిన అనంతరం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

చంద్రబాబు హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

About The Author