సిద్దిపేట నియోజకవర్గంలోని 773మంది రైతులకు నేడు పాస్ పుస్తకాలు…

సిద్దిపేట నియోజకవర్గంలోని 773మంది రైతులకు నేడు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం.

– సీఎం కేసీఆర్ గారు పారదర్శకంగా, రెవెన్యూ రికార్డు ప్రక్షాళన చేపట్టారు.
– గతంలో సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా 59640 మంది పాస్ బుక్స్ పంపిణీ చేశాం.
– 95 శాతం రెవెన్యూ ప్రక్షాళన పూర్తి అయ్యింది..
– కేసీఆర్ గారి కృషి వల్ల రెవెన్యూ కార్యాలయాలే రిజిస్ట్రేషన్ కార్యాలయలుగా మారుతున్నాయి.
– దేశంలో ఎక్కడ లేని విధంగా అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ ప్రక్షాళన పారదర్శకంగా నిర్వహిస్తున్నాం..
– పాస్ పుస్తకాలు ఉన్న రైతులందరికీ10వేల రైతుబందు అందిస్తాం.
– రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి నేల స్వభావం మారకుండా ఉండేందుకు నత్రజని ఉండే పచ్చి రొట్టె విత్తనాలు వాడాలి
– రసాయనిక ఎరువుల వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి.
– సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలి.
– రైతులకు రూపాయి ఖర్చు లేకుండా 100శాతం సబ్సిడీ తో గొర్రెలు,బర్రెల షెడ్లు మంజూరు చేస్తున్నాం
– రైతులు పొలం గట్లపై మొక్కలు నటాలి…
– రేపటి తరం సంతోషంగా ఉండాలంటే ప్రకృతి ని కాపాడాలి, లేకుంటే ఎండలు పెరిగి రాబోయే రోజుల్లో అగ్నిగుండంగా మారుతుంది.

About The Author