సరిలేరునీకెవ్వరు అంటూ… 2020 లో మహేష్ బాబు తో వెండితెర పంచుకోనున్న విజయశాంతి…


సరిలేరునీకెవ్వరు అంటూ… 2020 లో మహేష్ బాబు తో వెండితెర పంచుకోనున్న విజయశాంతి…

పద్నాలుగేళ్ళ వయస్సులో సూపర్‌స్టార్_కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడు తో… తెలుగు సినీ ఆరంగేట్రం చేసి… పాతిక ఏళ్ళ ప్రస్థానంలో 180 సినిమాల్లో నటించిన రాములమ్మ… మళ్ళీ పద్నాలుగేళ్ళ విరామం తర్వాత ఆ సూపర్ స్టార్ వారసుడితో… రెండో ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టనుంది.

90వ దశకంలో… దక్షిణభారత సినిమా పరిశ్రమలో కథానాయిక ప్రాధాన్యత గల సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరచుకొన్న నటి విజయశాంతి.

1996లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని  ఏఐఏడీఎంకె పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినా… 1998లో భారతీయ జనతా పార్టీ లో చేరి పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 సాధారణ ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి సోనియా గాంధీ పోటీ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో… ఆమెకు పోటీ అభ్యర్ధిగా బీజేపీ విజయశాంతి ని ప్రకటించడంతో… ఒక్కసారిగా దేశ రాజకీయ వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు, అయితే సోనియా ఆ ఎన్నికలలో కర్ణాటక లోని బళ్ళారి నియోజకవర్గం నుంచి పోటీచేయడంతో… కడప అభ్యర్ధిత్వం నుంచి వైదొలిగారు #విజయశాంతి.

తెలంగాణ విభజన ఉద్యమం మలిదశకు చేరుకొంటున్న సమయంలో… తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించి, ఆశించిన వనరులు, ప్రజాదరణ లేక… పార్టీ నిర్వహణ కష్టతరమైన పరిస్థితులలో జనవరి 2009న కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ లో తన పార్టీని విలీనం చేసిన విజయశాంతి, అదే సంవత్సరం టీఆర్ఎస్ అభ్యర్థి గా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.

#టీఆర్ఎస్ అధినేత తో విభేదాల నేపథ్యంలో… 2014 సాధారణ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు విజయశాంతి.

2014 లో మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. మళ్ళీ 2018 లో తెలంగాణ పిసిసి ప్రచార కమిటి సలహాదారుగా, స్టార్ క్యాంపెయినర్ గా రాహుల్ గాంధీ నియమించినా… తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూడడంతో…. విజయశాంతి రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అయ్యిందనే చెప్పవచ్చు…

ఈ పరిస్థితుల్లో తనకంటూ ఓ గుర్తింపునిచ్చిన సినీరంగంవైపు మళ్ళీ అడుగులు వేస్తూ… తన సినీ ప్రస్థానంలోని రెండవ అంకం పై ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పంచుకొన్నారు విజయశాంతి…

2020 సంక్రాంతి కి విడుదల కానున్న సూపర్ స్టార్ మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు లో కీలక పాత్రలో నటిస్తున్న విషయాన్ని స్వయంగా ప్రకటించారు #విజయశాంతి.

About The Author