భారత వాయుసేన విమానం ఆచూకీ గల్లంతు….
భారతీయ వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ ఆచూకీ గల్లంతు అయ్యింది…
అస్సాంలోని జోర్‌హాట్ నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ విమానం మిస్సైనట్లు అధికారులు పేర్కొన్నారు. 13 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం, ఆంటనోవ్ 32 రకానికి చదినది…
నేటి మధ్యహ్నం 12.25 నిమిషాలకు జోర్‌హాట్ నుంచి టేకాఫ్ తీసుకొన్న ఎయిర్ క్రాఫ్ట్, అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచూకా ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ విమానం చివరిసారిగా ఒంటి గంటకు ఏటీసీ తో కాంటాక్ట్ అయ్యింది.
ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చేపడుతున్నారు. సీ 130 స్పెషల్ ఆపరేషన్ విమానాన్ని కూడా సెర్చ్ ఆపరేషన్ కోసం వాడుతున్నారు.
ఘటనపై స్పందించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్…
గత గఘఘకొన్ని గంటలుగా ఆచూకీ తెలియకుండా పోయిన ఐఏఎఫ్ ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ గురించి భారత వైమానిక దళ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ భాదౌరియాతో మాట్లాడాను. దాని ఆచూకీ కనుగొనేందుకు ప్రారంభించిన ప్రయత్నాల గురించి ఆయన నాకు వివరించారు. అందులో ఉన్న వారి క్షేమ సమాచారం కోసం ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. రాజ్ నాథ్