నవరత్నాలు… నవ మంత్రులు… వైసీపీ వ్యూహం…?
ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీకి దగ్గరచేసింది ఆపార్టీ ప్రకటించిన నవరత్నాలే…
అసలు వైసీపీ ఆవిర్భావంలోనే తొమ్మిది అంకెది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకంలో దివంగత వైఎస్ఆర్ ఫోటో చుట్టూ ఉన్న పేదవాడి సొంత ఇంటి కల, ప్రాజెక్టుల జల కళ, విద్య,వైద్యం వంటి తొమ్మది ఆశయాలే తమ అజెండాగా పార్టీ పతాకాన్ని తయారు చేసారని చెప్పవచ్చు…
ఇక ఇవన్నీ ఇప్పుడెందుకు అంటారా..?
సార్వత్రిక ఎన్నికలలో ఊహించని అద్భుత విజయాన్ని సొంతం చేసుకొన్న జగన్ మోహన్ రెడ్డి, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ… తానొక్కడే ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసారు. అది మొదలు పాలన పై పట్టు సాధించేందుకు వరుస సమీక్షలతో క్షణం తీరిక లేక… సొంత పార్టీ నేతలకు కూడా తన అపాయింట్మెంట్ ను నిరాకరిస్తూ… మంత్రివర్గ విస్తరణపై అంతర్గత కసరత్తును జగన్ ముమ్మరం చేసారు అని పార్టీలోని కీలక వర్గాల సమాచారం…
ఇక మంత్రివర్గ విస్తరణపై తనదైన శైలిలో వ్యవహరిస్తున్న జగన్ ఈ నెల 8న ముహూర్తం కూడా ఖరారు చేసారు…
‘నిజం’ కు ఉన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్దపీట వేస్తూ… తొమ్మిది మంది తో తొలి మంత్రివర్గ విస్తరణను చేయనున్నారని సమాచారం.