ఉప రాష్ట్రపతి గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం
ఉప రాష్ట్రపతి గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం
తిరుపతి, జాన్ 3: మూడు రోజుల తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం వైజాగ్ నుండి భారత వాయు సేన ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 11:05 గంటలకు రేణిగుంట ఓల్డ్ ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన గౌ.భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారికి జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, తిరుపతి మునిసిపల్ కమీషనర్ విజయరామ రాజు, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులు పుష్ప గుచ్చాలు అంధించి ఘన స్వాగతం పలికారు.
ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీతేజ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులు రాజశేఖర్ రెడ్డి, డిసి శుక్లా, చిత్తూరు ఆర్డిఓ మల్లిఖార్జున, మెప్మా పీడీ జ్యోతి, ఎడిఎఫ్ఓ ఆదినారాయణ రెడ్డి, అదనపు ఏస్పీ అనిల్ బాబు, డిఎస్పీ చంద్ర శేఖర్, భాజపా నాయకులు చిలకం రామచంద్రా రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి తనయుడు పృథ్వీ, పుష్పలత, తహసీల్దార్ మాధవకృష్ణా రెడ్డి తదితరులు కూడా గౌరవ ఉపరాష్ట్రపతి గారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం, గౌ. ఉపరాష్ట్రపతి గారు ప్రత్యేక వాహన శ్రేణిలో గాదంకి ఎన్. ఏ.ఆర్.ఎల్.కు వెళ్లారు.ఈ మధ్యాహ్నం తిరిగి తిరుపతి పద్మావతి అతిధి గృహం చేరుకుని కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటారు.
సా.6 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకుని రాత్రి బస చేసి ఈ నెల 4 న ఉదయం ఉప రాష్ట్రపతి తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్షించుకుంటారు. 5 వ తేదీన న బుధవారం ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ ప్రయాణమవుతారు