ఇది మాఫియాకు మీడియాకు మధ్య జరుగుతున్న పోరాటం… రవి ప్రకాష్
తనపై నమోదైన ఫోర్జరి, మోసం తదితర కేసులలో అరెస్టు కాకుండా ఉండేందుకు, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఫలితం లేకపోయేసరికి, విధిలేని పరిస్థితుల్లో… సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్… దాదాపు ఆరు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం తిరిగి జూన్ 5 ఉదయం 11గం లకు తిరిగి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసారు సైబర్ క్రైం పోలీసులు…
అయితే టీవీ9 ను హైదరాబాద్ కు చెందిన ఇద్దరు బడా వ్యాపారవేత్తలు అక్రమంగా, అడ్డదారుల్లో సొంతం చేసుకొన్నారని, తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు రవి ప్రకాష్..
ఇది మాఫియాకు, మీడియాకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన రవి ప్రకాష్, తనకు ఈ అక్రమ కేసుల విషయంలో.. చాలా మంది పోలీసులు అండగా నిలిచారని, ఈ మాఫియాను ఎదుర్కోవడంలో తనకు సహకరిస్తామని చెప్పారని వ్యాఖ్యానించారు రవి ప్రకాష్.