కడప జిల్లా రైల్వేకోడూరులో దారుణ హత్య …
కడప జిల్లా రైల్వేకోడూరులో దారుణ హత్య కోడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బుధవారం ఉదయం అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు అబ్దుల్ ఖాదర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నట్లు సమాచారం మృతుడు ఖాదర్కు ఈ నెల ఇరవై ఆరు న వివాహము కూడా నిశ్చయమైనట్లు తెలిసింది హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
రంజాన్ పూట ఓ కుటుంబంలో కోలుకోలేని విషాదం అలముకుంది. 20 రోజుల్లో పెళ్లికొడుకుగా ముస్తాబు కావాలసిన యువకుడిని కొందరు దారికాచి చంపేశారు. రంజాన్ పండగపూట ఈ దారుణం జరిగింది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ అనే 26 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీరును కొందరు నరికి చంపేశారు.
బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఖాదర్ రంజాన్ పండుగ కోసం ఈరోజు వేకువజామున రైల్వే కోడూరు వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా శ్రీకృష్ణ సినిమా హాల్ వద్ద దుండగులు అతనిపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఖాదర్‌కు ఇటీవలే సమీప బంధువు కూతురితో నిశ్చితార్థం జరిగింది.