వీడు నరరూప రాక్షసుడు… వైద్యంకోసం వచ్చే రోగులకు పాయిజన్ ఇస్తాడు..


అతడో మేల్ నర్సు.. తనను తాను గొప్పవాడిగా నిరూపించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన రోగుల ప్రాణాలతో చెలగాటమాడేవాడు. వారికి విషం ఇంజక్షన్లు ఇచ్చి గుండె పనితీరును దెబ్బ తీసేవాడు. తిరిగి తానే వైద్యం చేసి వారిని బ్రతికించి సహోద్యోగుల దృష్టిలో మార్కులు కొట్టేయాలన్న ఆరాటం ఆయనది. అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టేవి. ఫలితంగా 100 మంది రోగులు తమ ప్రాణాలు కోల్పోయారు. ముక్కున వేలేసుకునేలా చేసిన ఈ ఘటనలు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. వరుస హత్యల నిందితుడిగా ఉన్న నెయిల్స్‌ హోయ్‌జల్‌ ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేవాడు. అతడికి అందరిలో గుర్తింపు సంపాదించాలనే తపన ఎక్కువ. తనకు తాను దైవాంశ సంభూతుడిగా నిరూపించుకునేందుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగులకు వైద్యం చేసేవాడు. వారు బతికితే సహోద్యోగుల దృష్టిలో హీరో అవ్వాలనే ఆకాంక్ష ఆయనది. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వచ్చే రోగులకు విషం ఎక్కించి, వారి గుండె పని చేయకుండా చేసేవాడు. మళ్లీ తానే వైద్యం చేసి బతికించాలన్న ఆలోచన ఆయనది. కానీ, ఈ క్రమంలో 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్య 200కు పైగానే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.

About The Author