రేణిగుంట మండలం కరకంబాడి పరిధిలోని తారకరామా నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ…


రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామా నగర్ చంద్రబాబు నాయుడు కాలనీలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు .35 వేలనగదు, రెండు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసముంటున్న పులికల్లు మోహన్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అత్త గారింటికి వెళ్లారు.. శుక్రవారం తెల్లవారుజామున పక్కనే నివాసముంటున్న గోవిందమ్మ అనే మహిళ ఇంటిని చూడడంతో తాళాలు బద్దలు కొట్టి తలుపు తెరిచి ఉంది .విషయాన్ని మోహన్ కు సమాచారం అందించింది. వెంటనే ఇంటికి చేరుకున్న బాధితులు ఇంట్లో పరిశీలించగా బీరువా లో ఉన్న 35 వేల నగదు, రెండు సవర్ల గొలుసు, కమ్మలు చోరీకి గురైన టు నిర్ధారించుకున్నారు .రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు విచారిస్తున్నారు .ఈ సందర్భంగా బాధితులు చోరీ జరిగిన తీరును మీడియాకు వివరించారు. మోహన్ ఇంటికి సమీపంలోనే శశిరేఖ అనే మహిళా ఇంట్లో 700 రూపాయల నగదు వెండి పట్టీలు చోరీకి గురయ్యాయి.

About The Author