ఏపీ సచివాలయ ఉద్యోగులతో తొలి భేటీ…
ఏపీ సచివాలయ ఉద్యోగులతో తొలి భేటీ… గతంలో చంద్రబాబుతో సన్నిహితం గా ఉన్నవారిని నేను తప్పుగా అనుకోను…. జగన్
గత ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారితో పనిచేసి ఉండటం వల్ల కొంతమంది ఉద్యోగుల ఆయనతో సన్నిహితంగా ఉండి ఉండవచ్చు, ఏదైనా పనులు చేయించుకోవడం కోసం గత ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితిని నేను అర్ధం చేసుకోగలను, కాబట్టి నేను ఆ విషయాన్ని తప్పుగా భావించనని మీ అందరికీ మాట ఇస్తున్నాను అని పేర్కొన్నారు సీఎం జగన్..
ముఖ్యమంత్రిగారితో సన్నిహితంగా ఉండటం ద్వారానే వారితో ఉద్యోగ సంఘాలు ఏవైనా పనులు చేయించుకునే పరిస్థితి ఉంటుంది.. అందువల్ల నేను ఆయా అంశాలను పట్టించుకోను అని అన్నారు జగన్.
ప్రతి విభాగంలో ప్రతి సెక్రటరీ, హెచ్ వోడీ దగ్గర వైసీపీ మేనిఫెస్టో ఉండాలని, మళ్లీ ఎన్నికల వచ్చే నాటికి ఈ మేనిఫెస్టోలోని ప్రతి పని.. ప్రతి అంశం చేశామని చెప్పి ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి ఉండాలన్నారు జగన్.
ప్రజలు మంచి ప్రభుత్వాన్ని కోరి ఓటు వేస్తారు. మంచి ప్రభుత్వం అంటే నేనొక్కడినే కాదు.. మీ అందరిని కలుపుకుంటేనే మంచి ప్రభుత్వం.
మేనిఫెస్టోలోని అన్ని అంశాలు అమలు కావాలని సెక్రటరీలు అందరికీ చెప్పాం. మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం ఇస్తున్నట్టు ప్రకటించిన సీఎం, సీపీఎస్ ను కూడా రద్దు చేస్తామన్నారు…
కేబినెట్ లో ఇవన్నీ పూర్తి చేసి ఎలా చేయాలన్న అంశంపై ముందుకు వెళ్లేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ప్రభుత్వంలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న వారికి సంబంధించి వారి అర్హత, అనుభవంల ఆధారంగా వీలైనంత ఎక్కువ మందిని ప్రభుత్వంలోకి తీసుకుంటాం అంటూ జగన్ ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు కు సమ్మతించారు సీఎం.
ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి భయపడాల్సిందేమీ లేదు.. రేపు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య లేకుండా ఏం చేస్తామనేది కేబినెట్ లోచెబుతాం అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి