హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ వెండి…
హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 10.5 టన్నుల వెండి పట్టి వేత.. చెన్నై నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. మేడ్చల్ సుచిత్ర వద్ద రెండు కంటైనర్లు నిలిపి బ్రింక్స్ సెక్యూరిటీ సర్వీస్ చెందిన వాహనాల్లో డంప్ చేస్తుండగా చూసి, అనుమానం వచ్చి పోలీసులు కి సమాచారం ఇచ్చిన స్థానికులు…
రెండు కంటైనర్లు తో పాటు సెక్యూరిటీ ఏజెన్సీ కి చెందిన వాహనాలు స్వాధీనం, సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ కు వెండి ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా…
నలుగురు డ్రైవర్లు తో పాటు , సెక్యూరిటీ ఏజెన్సీ వారిని విచారణ చేస్తున్న పోలీసులు.
లండన్ జేపీ మురుగన్ నుండి 10వేల8 వందల 68 కిలోల వెండి కడ్డీలు బ్రింక్స్ ఇండియా ప్రై.లి, చెన్నయ్ ద్వారా వచ్చినట్టు గుర్తింపు.
చెన్నై నుండి హైద్రాబాద్ లోని రత్నాకర్ బాంక్ లి కు రావాల్సి ఉంది, సుచిత్ర దగ్గర డైరీ ఫారం సమీపంలో నిన్న మధ్యాహ్నం డిసీమ్ ల నుండి… బ్రింక్స్ ఇండియా కు చెందిన వాహనాల లోకి డంప్ చేస్తుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ వెండి కడ్డీలు సంబంధించి సమాచారాన్ని ఐటి, జీఎస్టీ ఆధికారులకు అందజేశామన్న పోలీసులు.