ఒక శాడిస్ట్ కారణంగా పీటలమీద పెళ్లి ఆగింది..


పీటల దాకా వచ్చిన వివాహ వేడుక ఓ యువకుడి కారణంగా ఆగిపోయింది. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా డోన్‌లో చోటుచేసుకుంది. డోన్‌కు చెందిన అమ్మాయికి, ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబ్బాయితో పెళ్లి కుదిరింది. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం వేడుకలు జరుగుతున్న సమయంలో నంద్యాలకు చెందిన సురేష్‌ అనే యువకుడు వచ్చి పెళ్లికూతుర్ని తాను ప్రేమిస్తున్నానంటూ హంగామా చేశాడు. ఆగ్రహించిన నిర్వాహకులు అతన్ని పోలీసులకు అప్పగించారు. అతనెవరో తనకు తెలియదని వధువు ఎంతగా చెప్పినా వరుడి తరఫు వారు పట్టించుకోకుండా పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్‌.ఐ. సునీల్‌కుమార్‌ తెలిపారు.

About The Author