శ్రీవారి సేవలో నటులు కవిత, తనికెళ్ళ భరణి…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో రాజమండ్రి ఎంపీ భరత్ రాం,
నటి కవిత, తనికెళ్ళ భరణి తదితరులు శ్రీవారివసేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో వేధ ఆశీర్వచనం, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలో అడుగుపెట్టగానే మనసుకు ఎంతో ప్రశాంతత వచ్చిందన్నారు తనికెళ్ళ భరణి. చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలా ఒక విలక్షణమైన పాత్ర చేస్తున్నానని చెప్పారు. తాను దర్శకుడిగా ఓ చిత్రం తీస్తున్నానని అది ఆగస్టులో విడుదల చేస్తున్నట్లు తెలిపారు భరణి. అనంతరం సినీనటి కవిత తెలుగుదేం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ.పిలో టి.డి.పి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, రాక్షస, అవినీతి అక్రమ పాలన అంతం చేసి, ప్రజలు జగన్ కు పట్టం గట్టారు ఎంతో సంతోషంగా ఉందన్నారు కవిత. అహంకారం మనిషికి పనికిరాదని, అలాంటి వాళ్ళను దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని అన్నారు. ప్రధానిపై మాట్లాడేటప్పుడు వాళ్ళు తన స్థాయిని తెలుసుకోవాలని టిడిపి నేతలకు హితవు పలికారు. ఇప్పటికే తెలంగాణాలో టి.డి.పి పార్టీ జెండా పీకేశారని, ఏ.పి లో ఇప్పుడున్న వాళ్ళు కూడా 2024 నాటికి ఉండరని, టి.డి.పి భూస్తాపితం అవుతుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి అవినీతి లేని పాలన అందించాలని వినతిపత్రం ఇవ్వనున్నట్లు కవిత చెప్పారు.