అతి త్వరలో పేద ప్రజల సొంతింటి కల సాకారం…


– సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం.
– వెజ్ , నాన్ వెజ్ మార్కెట్, రైతు బజార్, నీటి వసతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.
– అన్ని వసతులు శరవేగంగా పూర్తి చేయాలి .
– ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి..అర్హులైన జాబితా ను సిద్ధం చేయాలి…
– క్షేత్ర స్థాయిలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలన.

ఇప్పటి వరకు పూర్తి అయిన 2,160 మరియు ఇళ్ల నిర్మాణాల పెండింగ్ పనులపై అరా తీశారు.. పలు అంశాలపై వివిద శాఖలకు సంబంధించిన అధికారులకు పనులు పూర్త చేయాలి అని..పలు సూచనలు చేశారు… ముందు వైపు ఉన్న డి బ్లాక్ లో 280 ఇళ్లకు 150 ఇళ్ళు పూర్తి అయ్యాయి అని పంచాయతీ రాజ్ అధికారులు చెప్పారు.. డి బ్లాక్ లో పూర్తి అయిన ప్రతి డబుల్ బెడ్రూం ఇంటికి త్రాగు నీటి సౌకర్యం ఉండే విధంగా ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్ అధికారులు సమన్వయం తో పని చేయాలి అని పైప్ లైన్ పనులు పూర్తి చేసి , ప్రతి అవాసానికి నల్లాలు బిగించి నీటిని పొదుపు గా వాడేందుకు మీటర్లు ఏర్పాటు చేయాలని , అన్ని బ్లాక్ లలో నీటి సౌకర్యం ఉండే విధంగా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ శ్రీనివాసా చారి ని ఆదేశించారు.. పట్టణానకి దూరంగ ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డబుల్ బెడ్రూం ఇళ్ళ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు , రైతు బజార్ పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలని.. కమ్యూనిటీ హల్ ( ఫంక్షన్ హల్) పనులు త్వరితగతిన పూర్తి చేయాలని , ఫంక్షన్ హల్ ముందు పార్కింగ్ స్థలంలో చుట్టూ చెట్లు నాటాలని , అదే స్థలంలో వచ్చే వారు సేద తీరేందుకు పార్క్ మాదిరిగా లాన్ ని ఏర్పాటు చేయాలని, డబుల్ బెడ్రూం పైలాన్ పనులు, స్వాగత తోరణం ( కామాన్ ) పనులు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారి వేణు గోపాల్ ని ఆదేశించారు.. విద్యుత్ కు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి బ్లాక్ రోడ్ కు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి అని విద్యుత్ డీఈ శ్యామ్ సుందర్ ని ఆదేశించారు.. అదేవిధంగా ఈ 2450 డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికీ పనులు పూర్తి కాగా డ్రైనేజ్ వెళ్లుటకు ఎస్ టీ పి పనులు వెను వెంటనే పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.. పెండింగ్ లో ఉన్న స్థల వివాద సమస్యలను రెండు రోజుల్లో పరిష్కారం చేయాలని ఆర్డీవో జయ చందర్ ని ఆదేశించారు..

– ఎంపిక ప్రక్రియ అర్హులైన జాబితా ని సిద్ధం చేయాలి..
అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు గతంలో దరఖాస్తు ల స్వీకరణ చేపట్టగా అర్హులైన వారిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గారికి ఫోన్ లో కోరారు .. గతంలో వార్డుల వారిగా అధికారులను నియమించి సర్వే చేశామని ఆ ప్రక్రియ ను కొనసాగిస్తు.. వెంటనే పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన జాబితా ను సిద్ధం చేయాలని సూచించారు..

About The Author