గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి…
పూతలపట్టు నాయుడుపేట హైవే రేణిగుంట మండలం గురవరాజు పల్లి క్రాస్ దగ్గర, మల్లవారం నుండి బుల్లెట్ బైక్ పై రేణిగుంట వస్తున్న శంకర్ రెడ్డి, మురళి లను గుర్తుతెలియని వాహనం ఢీకొన డంతో శంకర్ రెడ్డి (50) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మురళి ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.