ఈఎస్ఐ లబ్ధిదారులకు మరింత అండగా మోదీజీ సర్కార్…

కేంద్ర ప్రభుత్వం చిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఆరోగ్య భరోసా కల్పించే కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈ ఎస్ ఐ) పరిధిలోకి వచ్చే సభ్యుల రుసుమును తగ్గించింది. ఈఎస్ఐ చట్టం కింద వారి నుంచీ వసూల్ చేస్తున్న మొత్తాన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తూ మోదీజీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సభ్యత్వ రుసుములో కొంత భాగాన్ని ఉద్యోగి చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి సభ్యత్వ వాటాను 1.74 నుంచీ 0.75 శాతానికి, యాజమాన్య వాటాను 4.75 నుంచీ 3.25 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి రానుంది

About The Author