తిరుపతి రైల్వే స్టేషన్ గోల్డ్ రేటింగ్ సర్టిఫికేట్ అందుకోవడం అభినందనీయం – కేంద్ర రైల్వే శాఖ మంత్రి

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నగరం లోని రైల్వే స్టేషన్ లోని వసతుల కల్పన, ఉత్తమ సేవలకు గ్రీన్ బిల్డింగ్ కార్పొరేషన్ అమరావతి చాప్టర్ వారు నేడు నాచేతుల మీదుగా గోల్డ్ రేటింగ్ సర్టిఫికేట్ , మెమంటో తిరుపతి రైల్వే స్టేషన్ కు ప్రధానం చేయడం అభినందనీయమని కేంద్ర రైల్వే వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక గ్రాండ్ రిట్జ్ హోటల్ లో ఈ అవార్డును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కేంద్రమంత్రి అందించారు. ఈ సందర్బంగా మంత్రి వివరిస్తూ రైల్వే శాఖలో పోటీ తత్వంతో అభివృధ్ధి, సేవల అందుబాటులోకి తీసుకు రావడానికి ఈ అవార్డులు ఉపకరిస్తాయని అన్నారు. ప్రధానంగా ఈ అవార్డులు 50 శాతం పైబడి వసతులు వున్న వాటికి ప్రధానం చేయడం జరుగుతుందని సర్టిఫికేట్ 50-59.సిల్వర్ 60-69,గోల్డ్ 70-79, డైమండ్ 80-100 పాయింట్లు నిర్ధేశమని అన్నారు. తిరుపతి స్టేషన్ వసతులు నిర్వహణ లిఫ్ట్ లు, వైటింగ్ హాల్లు, విశ్రాంతి గదులు వంటి వాటికి , ఆరోగ్యం పరిశుబ్రత నిర్వహణకు, విద్యుత్ ఆదా, నీటివినియోగం, గ్రీన్ ఇన్నోవేషన్, స్మార్ట్ అభివృద్ధి లో 71 పాయింట్లు సాదించిడం వల్ల ఈ అవార్డు కైసవంచేసుకుందని తెలిపారు.
ఐజిబిసి (గ్రీన్ బిల్డింగ్ కార్పొరేషన్ ) అమరావతి చాప్టర్ ఛైర్మన్ విజయ్ సాయి ఎం., ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.వెంకటగిరి తిరుపతి రైల్వే స్టేషన్ గోల్డ్ రేటింగ్ సర్టిఫికేట్, మెమంటో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్య , ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతులు మీదుగా దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ గాజానన్ మల్లయ్య, డీఆర్ ఎం విజయ్ ప్రతాప్ సింఘ్ , డివిజనల్ హౌస్ కీపింగ్ , పర్యావరణ మేనేజర్ రవికిరణ్, తిరుపతి రైల్వే స్టేషన్ పూర్వపు డైరెక్టర్ సత్యనారాయణ, ప్రస్తుత శర్మ అందుకున్నారు.
ఈ కార్యక్రమలో జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తా, జెసి గిరీషా పి.ఎస్, నగర పాలక కమీషనర్ విజయ్ రామరాజు , సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ , బిజెపి ప్రతినిధులు వున్నారు.
–డివిజనల్ పిఆర్ ఓ తిరుపతి —

About The Author