రూ.20 వేలలోపు కట్టిన వారికి క్లియర్‌
జాబితా సిద్ధం చేసిన సీఐడీ అధికారులు
1,150 కోట్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధం
గత ప్రభుత్వం 250 కోట్లు కేటాయింపు
ఆగస్టులో బాధితులకు సొమ్ము పంపిణీ
త్వరలో వారితో భేటీకానున్న సీఎంఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందే సమయం సమీపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సీఐడీ అధికారులు డిపాజిటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏ విభాగంలో ఎంత మంది ఉన్నారు, వారిలో డేటా మ్యాచ్‌ అయిన వారెందరు, కాని వారి సంఖ్య ఎంత, ఎవరెవరికి ఎంత ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది… వంటి వివరాలతో జాబితాను సీఐడీ అధికారులు సిద్ధం చేశారు. రూ.20వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారికి ఆగస్టులో క్లియర్‌ చేసే ఆలోచనలో జగన్‌ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనికోసం అవసరమైన రూ.1,429కోట్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,150కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. గత ప్రభుత్వం కేటాయించిన 250 కోట్లు, అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించిన కొన్ని ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులను కలుపుకొని.. ఈ డిపాజిటర్లకు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

About The Author