అలిపిరిలో భక్తుడిపై దాడి ఘటనలో బదిలీవేటు…
తిరుమల : అలిపిరిలో భక్తుడిపై దాడి ఘటనలో బాధ్యులైన నలుగురు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు టీటీడీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై బదిలీ వేటు పడింది. గురువారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టుకు చెందిన ఢిల్లీబాబు వద్ద నిషేధిత పొగాకు ప్యాకెట్లు కనిపించటంతో వాగ్వాదం మొదలై ఘర్షణ జరిగింది. ఈ తరుణంలో సహనం కోల్పోయిన ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది భక్తుడిపై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరపాలని విజిలెన్స్‌కు టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఘటనలో బాధ్యులైన నలుగురు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లతో పాటు మరో ఇద్దరు టీటీడీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై బదిలీవేటు వేశారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.