5వ నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశం… మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా..!


5వ నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశం… మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా..!
దేశ పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం, రెండవ సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక, శనివారం ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించనున్నారు…
అయితే..‌. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్_అమరీందర్ తోపాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావులు నీతిఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం…
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా అజెండాను తయారుచేసిందని, నీతి ఆయోగ్ ను పనికిమాలిన సమావేశంగా పేర్కొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తాను ఆ సమావేశానికి రావడం లేదని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహాల్లో ఉండటంతో ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు అవుతున్నారు
పంజాబ్ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ కూడా నీతి ఆయోగ్ సమావేశానిక హాజరు కావడం లేదు.
దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు అధిగమించేందుకు , వర్షపునీటి_నిల్వ కోసం తీసుకోవాల్సిన చర్యలు మరియు ఉగ్రవాదం పై నేటి నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు.

About The Author