సమాజంలో నేటి డాక్టర్స్ పరిస్థితి..వారి పాత్ర


మీరెప్పుడైనా ఒక ప్రభుత్వ డాక్టర్ కి డబ్బులు ఇచ్చి
నన్ను ఎదో ఒక మందు ఇచ్చి చంపండి Plz అని అడగండి
నూటికి 99.99%మంది వైద్యులు ఎవ్వరూ అలా చేయరు.
కారణం వారు ఉండేది ప్రాణాలు నిలపడానికే తప్ప
చంపడానికి కాదని ప్రజలు గుర్తు ఎరగాల్సిన విషయం.
.
ఆ మిగిలిన 0.01% డాక్టర్స్ ప్రైవేటు ఆసుపత్రులలో
డబ్బుకోసం రెండు మూడు టెస్టులు ఎక్కువ
రాసి ఒక నాలుగు రోజులు ఎక్కువ ఉంచుకొని
డబ్బులుకోసం కక్కుర్తి పడచ్చు కానీ వారు కూడా
ఏ రోగిని చంపాలని అనుకోరు..ఆ పని చేయరు.
.
ఎందఱో గొప్ప గొప్ప ప్రభుత్వ డాక్టర్స్
నేటికి మన మధ్య నిజాయితీగా ప్రజలకి సేవ చేస్తున్నారు.
ప్రభుత్వ డాక్టర్స్ ప్రత్యేక క్లినిక్ ఉండచ్చుగాక.
కానీ వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు
వారు రోజూ తన దగ్గరికి వచ్చే వందలమందికి
తన క్లినిక్ లో ఎలా డబ్బుకు వైద్యం ఇస్తారో
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ఇచ్చిన
మందులు సదుపాయాలతో The Best Treatment
ఇవ్వడం కూడా నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
అలాంటి వారిలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తూ
ఎందఱో మన్ననలు అందుకుంటున్న
డాక్టర్ Vijayanirmala గారు ఒకరు.
.
ప్రైవేటు ఆసుపత్రి అంటే డబ్బుకోసం
మాత్రమే రోగులని చూసి వీలైనంత దోపిడీ చేస్తారని
చాలామంది అనుకుంటూ ఉంటారు..
కొన్ని ఆసుపత్రులలో అది నిజమే అయ్యి ఉండచ్చు.
కానీ వాటికి భిన్నంగా వేలమందికి తక్కువ డబ్బుతో
కొందరికి ఉచితంగా మందులు ఇవ్వడం,
మరికొందరికి పూర్తీగా ఉచితంగా సేవచేసిన
డాక్టర్ గా DrMalleshwari(మల్లేశ్వరి)Madam
ఎందఱో తల్లిబిడ్డలని కాపాడి ఈ భూమి మీద నిలబెట్టారు.
.
అలాగే డబ్బే పరమావధి కాకుండా
అవసరానికి పేదలకి ఉచిత వైద్యసాయం
అందించి ప్రజల మన్ననలు పొందిన
Dr.Satyaprasad Kpn గారు కూడా ఒకరు..
.
ఈ ముగ్గురు డాక్టర్స్ గురించి నేను స్వయంగా
చూసి తెలుసుకున్న అనుభవాలు ఇవి..
.
ఇక విషయానికి వస్తే..
.
పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్కతాలో
మన రాష్ట్రంలోలాగా ప్రభుత్వ ఆసుపత్రులకంటే
ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉండవు..
అలాగే వీధికి రెండు మల్టిస్పెషాలిటీ పేరుతొ ఉండవు.
అక్కడ నూటికి 80 శాతం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి
మీదనే ఆధార పడతారు.
.
అలా ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర
పరిస్థితిలో వచ్చిన ఒక రోగిని బ్రతికించలేకపొతే
ఆ రోగి బంధువులు ఇద్దరు జూనియర్ డాక్టర్స్ ని
(అందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉన్నారు)
రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టడంతో వారిని ICU చేర్చారు.
.
దీనికి ప్రతిగా వెంటనే జూనియర్
డాక్టర్స్ అందరూ విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.
మూడు రోజులుగా అంతకంతకు వారి నిరసన
పెరగడంతో ముఖ్యమంత్రి మమత రంగంలోకి దిగారు.
దాడులని ఖండించి దోషులని పట్టుకోవాల్సిన
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దాడి
జరిగినవారిపై పదజాలంతో విరుచుకుపడ్డారు.
‘ సమ్మెను విరమించి వెంటనే విధుల్లో
చేరిన వారే హాస్పిటల్‌లో ఉంటారు.
లేకుంటే పోలీసులతో బయటకు నెట్టిస్తామని,
హాస్టల్ లో ఉన్నవారందరిని
ఖాళీచేయిస్తామని బెదిరింపులకు దిగారు.
విధి నిర్వహణలో భాగంగా ఎందరో పోలీసులు
చనిపోతున్నారు,వారెప్పుడూ వారి పనిని విస్మరించలేదే
అంటూ మరొక పరుషమైన వ్యాఖ్యలు చేయడంతో
వెంటనే ఆసుపత్రిలోని 45 మంది పెద్ద స్థాయి నుండి
చిన్న స్థాయి డాక్టర్స్ వరకు రాజీనామాలు ఇచ్చారు.
ఆ సంఖ్య రోజుకు రోజుకు పెరిగి నేడు 3000 మందికి చేరింది.
ప్రస్తుతం వారు సమ్మెలో ఉన్నారు.
గోటితో పోయేదానికి గొడ్డలిదాక తెచ్చి పెట్టుకునే
మమతకి ఇవన్నీ చాలా సింపుల్ అనుకోవచ్చు కానీ
డాక్టర్స్ కూడా మనోభావాలు ఉంటాయని
వాటిని గౌరవించలేని ఆమె వేస్ట్ ముఖ్యమంత్రి నా దృష్టిలో
.
రోజు రోజుకు ఈ ప్రభావం దేశవ్యాప్తంగా చూపిస్తోంది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ పైన
జరిగే ఇలాంటి దాడులకి ఇక చెక్ పెట్టాలని
తప్పకుండా డాక్టర్స్ రక్షణ కావాల్సిందేనని తేల్చి చెప్పింది
దేశవ్యాప్త నిరసనకి ఈనెల 17 నడుం బిగించారు.
.
దాడులని ఏ సభ్యసమాజం హర్షించదు.
అందునా డాక్టర్లపైన అసలు చేయకూడదు.
ఎందుకంటే వారు అలా సేవచేయడానికి జీవితాతంతం
మనకోసం కొత్త కొత్త విద్యలని నేర్చుకుంటూనే ఉంటారు.
నేటికాలంలో ఒక డాక్టర్ తయారు కావడానికి పదేళ్ళు
రాత్రింబవళ్ళు కష్టం ఎన్నో మానసిక శారీరక కష్టం ఉంటుంది.
.
నిర్లక్ష్యంతో వ్యవహరించి రోగి ప్రాణాలని
బలి కొంటె తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవచ్చు.
కానీ చనిపోయడానికి దానికి కారణం డాక్టర్ అని దాడి
చేయడం మాత్రం మొత్తం డాక్టర్స్ సమూహాన్ని
అవమానించి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసినవారం అవుతాము.
.
కాబట్టి ప్రజలు కూడా ప్రైవేటు ఆసుపత్రులకి
లేక ప్రభుత్వ ఆసుపత్రులకి వెళితే అది మన
ఇష్టపూర్వకంగా వెళ్ళి వారి చేతుల్లో ఉంచి
కాపాడమని డాక్టర్స్ ని వినయపూర్వకంగా వేడుకోవడం
తప్పించి వారిని కొట్టి తిట్టి మనం సాధించేది ఏమి లేదు.
నిబద్దతతో అంకితభావంతో పనిచేసే ఎందఱో
వైద్యుల పక్షాన వారి వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి
నిరంతరం వారి ప్రాణాలని కూడా పణంగా పెట్టి
రోగిని కాపాడుతుంటారు..
కనుక వారి వృత్తిని వారి కష్టాన్ని గుర్తిద్దాం

About The Author