13 దుంగలు సహా ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్…


పాత మార్గాలే స్మగ్లర్ల రాచమార్గాలు
* టాస్క్ ఫోర్స్ నిఘా తో కొత్త మార్గాలు రావడం లేదు
* 13 దుంగలు సహా ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

వేసవి కారణంగా అడవుల్లో నీరు లేకపోవడంతో ఇటీవల స్మగ్లర్ల జాడలు కనిపించడం లేదు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్మగ్లర్లు వినియోగించే అన్ని మార్గాలను కట్టుదిట్టం చేయడంతో కొత్త మార్గాలను వదిలేసి గతంలో వినియోగించే పాత మార్గాలను స్మగ్లింగ్ కు యత్నింస్తున్న విషయాన్ని శనివారం పట్టుబడిన స్మగ్లర్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ లింగాధర్, ఎఫ్ఎస్వో వెంకట సుబ్బయ్య బృందం శనివారం రాత్రి శ్రీవారి మెట్టు నుంచి అడవి లోపలికి కూంబింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో చంద్రగిరి మండలం నాగపట్ల ఈస్ట్ బీట్ ఈతగుంట చీకటీగలకోన మధ్య లో నైట్ విజన్ గాగుల్స్ సహాయంతో పరిశీలిస్తున్న సిబ్బందికి కొంత అలజడి కనిపించింది. గతంలో ఇదే మార్గంను స్మగ్లర్లు వినియోగిస్తున్న నేపధ్యంలో సిబ్బంది
పందిగుట్ట ప్రాంతంలో గస్తీ పెట్టారు. 14 మంది స్మగ్లర్లు అటుగా రాగా వారిని సిబ్బంది అడ్డగించారు. స్మగ్లర్లు సిబ్బందిని గమనించి ఎర్రచందనం దుంగలను చెల్లాచెదురుగా పారవేసి అక్కడి నుంచి పారిపోయారు. దట్టమైన అటవీలో ఎంతో శ్రమించి ఇద్దరు తమిళ స్మగ్లర్లు తిరువన్నామలై జిల్లా వీరిపురంకి చెందిన కుమార్ , వెల్లూరు జిల్లా కుట్టియామేడు కు చెందిన వేంగయన్ ను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఆహార పదార్థాలు, బ్యాగులు, చెట్లు కొట్టడానికి వినియోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో పరిశీలించగా 13 ఎర్రచందనం ఏ గ్రేడ్ దుంగలు, అందులో కొన్ని 6 అడుగుల ఎత్తు పైగా ఉన్నవి ఉన్నాయి. పట్టుబడిన స్మగ్లర్లు ను ప్రాధమికంగా విచారించగా గత 10 రోజుల నుంచి అడవిలో ఉన్నామని తాగడానికి నీరు లేక మురికి నీటిని బండ్ల పై ఉన్న వాటిని సేవించామన్నారు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
సంఘటన స్థలాన్ని టాస్క్ ఫోర్స్ డీఎస్పీ హర్ష, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఆర్ఐ మురళీ, ఎఫ్ఆర్వో ప్రసాద్ పరిశీలించారు. సిబ్బందిని టాస్క్ ఫోర్స్ ఐజి శ్రీ డాక్టర్ ఎం కాంతారావు గారు, ఎస్పీ శ్రీ రవిశంకర్ గారు అభినందనలు తెలిపారు.

About The Author