నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్…

 


నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
– వ్యానిటీ బ్యాగ్ అప్పగించిన
ఆటోవాలకు నగదు బహుమతి

పీలేరు: బస్సు ఎక్కాలన్న ఆతృతలో ఓ మహిళా ప్రయాణికురాలు బంగారు నగలు. నగదు, సెల్ ఫోన్ ఉన్న తన చేతి బ్యాగును ఆటోలో విడిచి బస్ ఎక్కేసింది. స్థానిక అజంతాటాకీస్ రోడ్డులో ఆటో ఎక్కిన శివరంజని అనే మహిళ వదలి వెళ్లిన సంచిని గుర్తించిన ఆటో డ్రైవర్ అసంచిని స్థానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బ్యాగును పరిశీలించారు. అందులో బంగారు గొలుసు, కొంత నగదుతో పాటు సెల్ ఫోన్ గుర్తించారు. బ్యాగు వదలి వెళ్లిన శివరంజని బాధ పడుతూ తిరిగి బస్టాండుకు వచ్చింది. బాధితురాలిని గమనించిన కానిస్టేబుల్, బిస్మిల్లా ఆటో యూనియన్ జిల్లా నాయకుడు బోదేషా వాలి ఆమెను స్టేషనుకు తీసుకు వెళ్ళారు. సిఐ చిన్న పెద్దయ్య, ఎస్సై సురేష్ బాధితు రాలికి బ్యాగు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నబీబ్ కు యూనియన్ నాయకుడు బోదేషా 5వందలు, సిఐ 15 వందల రూపాయల నగదును అందించి అభినందించారు.

ఫోటోలు: పోలీసుల నుంచి బ్యాగును తీసుకుంటున్న శివరంజని

– నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవరుకు నగదు బహుమతి ఇస్తోన్న దృశ్యం

About The Author