“కాశీ వర్సెస్ లవ్”…లవ్, రొమాన్స్ చిత్రాలలో కొత్తకోణంలో

నంది ఆర్ట్స్ నిర్మించిన మొదటి చిత్రం ‘కాశీ వర్సెస్ లవ్’. ఈ చిత్రానికి ‘చిత్తూరోడి ప్రేమ కథ’ ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఆడియో ఫంక్షన్ జరుపుకోబోతోంది. నంది కె రెడ్డి నిర్మించిన చిత్రానికి నూతన దర్శకుడు కె కామరాజు దర్శకత్వం వహించారు
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…”అందమైన పల్లెటూరు లో పచ్చని పొలాల్లో చిగురించిన ప్రేమకు….పరువు ప్రతిష్టలు ఊపిరిగా బ్రతికే తల్లిదండ్రుల మధ్య జరిగే సంఘర్షణ ఈ ప్రేమ కథ చిత్రం ‘కాశీ వర్సెస్ లవ్’. ఈ చిత్రానికి పాటలు అన్ని వినసొంపుగా అద్భుతంగా వచ్చాయి. సినిమా ఫ్యాషన్ కలిగిన నంది కె రెడ్డి గారు నిర్మాత అవ్వడం నా అదృష్టం. అతనికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటాను”అని అన్నారు
నిర్మాత నంది కె రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రం మొత్తం చూసిన తర్వాత మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం బి మ్ కృష్ణ గారు చాలా చక్కని సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని చాలా అందంగా చూపించారు కెమెరామెన్ గౌరీ శంకర్… ముఖ్యంగా హీరో చిన్న ,హీరోయిన్ సంధ్య దయన్, కిరణ్, మంచూరీ మారెప్ప తదితరులు నూతన నటీనటులు అయినా కూడా అ ప్రాణం పెట్టి నటించారు. ఈ సినిమా 100% ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాము…ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పాటలు విడుదల చేసి త్వరలో సినిమాని ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు
హీరో చిన్న, హీరోయిన్ సంధ్య దయన్, కిరణ్ , మాంచూరి మారెప్ప, మంజు, శివ కుమార్, కోటకొండ మురళి, ఏసీ బాబు ,ప్రకాష్ ,సిరి, సంజు తదితరులు నటించారు… ఈ చిత్రానికి దర్శకత్వం:- కె కామరాజు, నిర్మాత :-నంది కె రెడ్డి, కెమెరా మెన్:-గౌరీ శంకర్, సంగీతం:- బి మ్ కృష్ణ…
లవ్, రొమాన్స్ చిత్రాలలో కొత్తకోణంలో “కాశీ వర్సెస్ లవ్”…

 

About The Author