కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధిపేట లో సంబరాలు…


కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాంతంలో ప్రారంభోత్సవ సంబరాలు..

– నేడు నిజంగా ఒక శుభదినం.. తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం ఆంతే ముఖ్యం.
– ఈ రోజు తెలంగాణ ముద్దుబిడ్డ జయశంకర్ సార్ వర్థంతి కావడం నిజంగా కాకతాళియం.
– మన బీళ్లకు గోదావరి నీళ్లను మళ్లించుకుంటున్నామంటే అది జయశంకర్ సార్ కు నిజమైన నివాళి.
– నీళ్లు లేనిదే జీవం లేదు. నది పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు, సంస్కృతులు విలసిల్లాయి
– ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నవి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక రన్నింగ్ ప్రాజెక్టులు గా మారాయి.
– కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మాణంలో నాకూ పాత్ర లభించడం ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలం.
– 20 ప్రాజెక్టుల సమూహం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో 19 రిజర్వాయర్లు ఉంటాయి. వీటి కెపాసిటీ 140 టీఎంసీలు.
– 100 మీటర్ల నుంచి 620 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తి పొసే ప్రాజెక్టు ప్రపంచంలో మరోటి లేదు.
– 100 మీటర్ల నుంచి 400 మీటర్ల ఎత్తున ఉన్న ఇక్కడి రంగనాయక సాగర్ కు ఎత్తి పోస్తుంది.
– 30 ఏండ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే పూర్తి చేసుకున్నాం.
– ఇది నిజంగా ఒక చరిత్ర.. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఈ ప్రాజెక్టును చూసి అబ్బుర పడ్డారు.
– నిజంగా ఇది ప్రజల విజయం.. తెలంగాణ ఉద్యమ విజయం.
– కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే అది సాథ్యమైంది.
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, లేదంట కాంగ్రెస్ పార్టీలు పాలించాయి కానీ ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వలేదు.
– ఇంత గొప్ప ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామంటే ముఖ్యమంత్రి కేసిఆర్ గారి పనితీరు, ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతన్నల త్యాగఫలమే కారణం.
– అప్పటి ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర వివాదాలుగా మార్చారు.
– మహారాష్ట్ర తో అంతరాష్ట్ర ఒప్పందాన్ని చేసుకోవడం ఈ దేశానికే ఒక దిశానిర్దేశం.
– నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమైక్య కృషి తోనే ఇది సాధ్యమైంది.
– పట్టుదల ఉంటే దశాబ్దాలు కాదు. సంవత్సరాలోనే ఎంత పెద్ద ప్రాజెక్టు నైనా నిర్మించవచ్చని దేశానికే ఒక సంకేతాన్ని అందించాం.
– ఇన్నేళ్లు సముద్రంలో కలిసే నీటిని మన పంట పొలాల్లోకి మళ్లించుకుంటున్నాం.
– దసరాకు నెల ఆటో.. ఇటో.. సిద్దిపేటకు సాగు నీరందుతాయి.
– రంగనాయక సాగర్ రిజర్వాయర్ తో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాదించబోతున్నది.

About The Author