శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు బాధ్యతలు స్వీకరించారు…


గిరిజన సంక్షేమ శాఖామాత్యులుగా గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు బాధ్యతలు స్వీకరించారు. అమరావతి సచివాలయంలోని 5వ బ్లాక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ గంధం చంద్రుడు ఈఆశ్ గారు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలోని పథకాలను గౌరవ మంత్రివర్యులకు ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం సదరు ఫైలు తొలి సంతకం చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్మాణానికి రూ.19.97 లక్షలు మంజూరు చేస్తూ ఫైలుపై రెండవ సంతకం చేశారు.
ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ “గిరిజ‌న సంక్షేమం విష‌యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిగారి సంక‌ల్పానికి అనుగుణంగా ముంద‌డుగు వేస్తామ‌న్నారు.

About The Author