భార్య, అత్త వేధింపులు తాళలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య …


రంగారెడ్డి: భార్య, అత్త వేధింపులు తాళలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… హెచ్ఎస్‌బిసి బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న సముంత్ రెడ్డికి 4 నెలల క్రితం స్వప్నతో పెళ్లి జరిగింది. అయితే రాత్రి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అత్త, భార్య వేధింపులే తన ఆత్మహత్యకు కారణమైనట్టు సూసైడ్ నోట్‌లో సుముంత్ రెడ్డి పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.సముంత్ రెడ్డి లేఖలో ఏం రాశాడంటే.. అమ్మా, నాన్న నన్ను క్షమించండి. శ్రవంత్ బాగా చదువుకో… నా సూసైడ్‌కి స్వప్న కారణం. వాళ్ల అమ్మ, బాబాయి, సోదరుడిని అంత్యక్రియలకు రానివ్వకండి. ప్రశాంత్, వెంకట్ బావ… మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నాన్నా ఐలవ్యూ. వృద్ధాప్యంలో నిన్ను చూసుకోవల్సిన నేను స్వప్న, వాళ్ల అమ్మ వేధింపులతో ఈ లోకాన్ని విడిచి వెళుతున్నాను.

About The Author