విజయవాడలో రాజ్‌భవన్… సీ ఎం క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న అధికారులు…

విజయవాడ లోని మొట్టమొదటి ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని #రాజ్‌భవన్‌ గా మార్పు చేసేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు సీఆర్డియే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

#నవ్యాంధ్రప్రదేశ్ తొలి #ముఖ్యమంత్రి #చంద్రబాబునాయుడు తన ప్రభుత్వ పరిపాలనను ఏపీ నుంచి చేయాలి అని సంకల్పించిన తొలి నాళ్ళలో అందుకు వీలుగా ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత #వెలగపూడి లో తాత్కాలిక #సచివాలయం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి తరలిపోయింది.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి #గవర్నర్‌ #నరసింహన్, హైదరాబాద్‌ కేంద్రంగానే ఉంటూ, విజయవాడకు వచ్చి వెళుతున్నారు, గవర్నర్ విజయవాడకు వచ్చిన ప్రతిసారీ, ప్రైవేటు హోటళ్ళలోనే బస చేస్తున్నారు.

ఉమ్మడి #హైకోర్టు విభజన నేపథ్యంలో, తాత్కాలికంగా విజయవాడ లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచే తన కార్యకలాపాలను ప్రారంభించింది.

About The Author