ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై దాడి

ఢిల్లీ: సీనియర్ మహిళా జర్నలిస్టుపై కాల్పులు కలకలం సృష్టించాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త మిథాలీ చందోలాపై.. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ మిథాలీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

About The Author