108 ఆలస్యమైతే నా కారులో తీసుకెళ్లండి..
108 ఆలస్యమైతే నా కారులో తీసుకెళ్లండి..
రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి అనిల్ బాసట..
అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరునుంచి బయలుదేరి వెళ్లారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అంతలోనే 108రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడినుంచి తరలించే వరకు మంత్రి అనిల్ అక్కడే ఉన్నారు.